నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

 ఏప్రిల్ 5 1908 జన్మించారు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతూ అడగాలిన వర్గాల గొంతులను పైకి తీసుకువచ్చే రాజకీయ నాయకుడు కంటే ఆయన ఎక్కువే చేశారు. పేరుపొందిన స్వాతంత్ర సమరయోధుడు. సంఘసంస్కర్త. రాజకీయ వేత్త. బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు. బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారు. 1935లో అంటరాని సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్ట్ కాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు. 1991లో భారత తపాలా బిళ్ళ మీద బాబు జగ్జీవన్ రామ్ బొమ్మ ముద్రించబడింది.

బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని చాంద్వా ప్రాంతంలో జన్మించాడు పాఠశాలలో మతపరమైన విభజనకు మరియు అంటరానితనం యొక్క అభ్యాసానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అతను జవహర్లాల్ నెహ్రూ యొక్క తాత్కాలిక భారత రాజ్యాంగంలో ప్రతిష్టాత్మకమైన సామాజిక న్యాయ సూత్రాల యొక్క ప్రాముఖ్యతపై చాలా బలమైన ప్రాధాన్యత ఇచ్చారు.

బాబు జగ్జీవన్ రామ్ తండ్రి శోభిరామ్. తల్లి వసంతి దేవి. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1935న ఇంద్రానీ దేవిని వివాహం చేసుకున్నారు. 1952 నుండి 19 56 వరకు కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1976 నుండి 83వ ఏప్రిల్ వరకు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడిగా పని చేశారు. వలస రాజ్యాల అధికారులపై అతని చర్యలు చివరకు 1940 డిసెంబర్ 10న అతని అరెస్టు చేశారు. భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఎన్నో కీలక పాత్రలు పోషించారు. దళిత నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన కృషి అతని ఇతర ప్రభావాలకు భిన్నంగా ఉంది. పాఠశాల రోజులలో మతపరమైన విభజనకు మరియు అంటరానితనం యొక్క అభ్యాసానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. స్వాతంత్రం కోసం పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన క్యాబినెట్ మంత్రిగా రికార్డ్ సృష్టించారు. 198 6 జులై ఆరవ తేదీన స్వర్గస్తులైనారు. ఏప్రిల్ 5వ తేదీ జగ్జీవన్ రామ్ గారి 113 వ జయంతి సందర్భంగా నలుమూలల వేడుకలు జరుపుకుంటున్నారు.

తాటి కోల పద్మావతి గుంటూరు


కామెంట్‌లు