ప్రకృతి ;- కోరాడ నరసింహా రావు.
ఎన్నెన్నో రంగులలో...  
పూలమొక్కలుసువాసనలతో... 
మల్లి, సంపంగి, సన్నజాజి,  విరజాజులు...! 

ఆ నీలిఆకాశంలోమబ్బులతో పాటు...,
 సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు... !

 పెద్ద -పెద్ద కొండలుపైనుండి దూకే జలపాతాలు... !
గల - గలా పారే సెలయేళ్ళు !

రక -రకాల చెట్లు పక్షులు, జంతువులూ, క్రూరమృగాలతో 
దట్టమైన అడవులు... !
 
 ప్రాకృతంటే ఈ సహజ అందాలే పిల్లలూ... !
పాడి - పంటలతో.... పచ్చనిపొలాలతో విలసిల్లె అందమైన పల్లెలు.... 
ప్రక్రుతి ప్రతి రూపాలు !!

అందమైన ప్రకృతిని కాలుష్యాలతో మనం పాడుచెయ్యరాదుసుమా..., 
  మీరైనా శ్రద్ధతో.... అందాల  ఈ  సహజ ప్రకృతిని పరిరక్షించండి... !

విరివిగ మొక్కలను నాటాలీ... 
చెట్లను నరకుట ఆపాలి... 
కాలుష్య కారకాలను మీరైనా నిరోధించాలి... !
 
బావి భారత పౌరులు మీరే... 
రేపటి ఈ దేశం మీదే.... 
పాడైపోతున్న ప్రకృతిని... 
మీరే కాపాడుకోవాలి... !
  ********

కామెంట్‌లు