భారతం పట్టడం.
దేవలోకంలో రంభ అప్సరసలకు వృద్ధ భరతుడనే మహర్షి నాట్యం నేర్పాడు. భూలోకంలో నాట్య ప్రక్రియలను భరతుడనే ముని ఒక గ్రంథంలో సంస్కృత భాషలో ఆవిష్కరించాడు. నాట్యం చేయుట అంటే ఆడుట. దీనికి సంగీత ధ్వని కావాలి. ధ్వని కనుకూలంగా ఆడటాన్ని నాట్యం లేదా నృత్యం-నర్తనం అంటారు. భారతీయ సాంప్రదాయ నాట్యానికి భరతనాట్యమని పేరు వచ్చింది. అది కాలక్రమాన కథాకళి, కూచిపూడి, మణిపురి, ఒడిసి, కథక్ వైగర్వాటుగా మారి విభేదించింది. అయినా ఈ నాట్య పద్ధతులన్నిటిలోనూ ఒక సమాన లక్షణం ఉంది. అది హస్త పాద విన్యాసం లయబద్ధంగా తాళాను గుణంగా చేసే అవయవ విన్యాసం. ఇది సామాన్యుడికి ప్రయాసతో కూడిన పని."తకధిమి"వంటి ధ్వనులు, సరిగమలు బుక్క తిప్పుకోకుండా ఎవరో పాడుతుంటే నర్తకులు మెలికలు తిరిగి పోతూ ఆయాస పడటం తమాషాగా ఉంటుంది. పాడే వాళ్ళ పని"భరతం"పట్టడం ఆడే వాళ్ళ పని నాట్యం చేయడం అవతలి వ్యక్తి చేత ఆటలాడించాలంటే భరతుడి నాట్యంలో వాడే సంగీత భాగాన్ని అంటే భరతాన్ని పట్టాలన్నమాట. రాను రాను ఆవలి వ్యక్తిని ఏడిపించడం, బాధించడం, వేధించడం, కష్టపెట్టడం అన్న అర్థాలలో భారతం పట్టడం అనే అర్థాలతో జాతీయం వెలువడింది.
తెలుగుజాతీయం.;- తాటి కోల పద్మావతి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి