గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది కావున పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ఇది కేవలం ఒక మతానికి సంభందించిన గ్రంధం కాదు, అంతిమ ఘడియల్లో వినిపించాల్సిన వైరాగ్య గ్రంధం అసలే కాదు. ఈ సమస్యల మయ జీవన వలయంలో వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం.
చిన్ననాటి నుండి పిల్లలకు గీతాసారం వంటబడితే.. జీవితంలో ఉన్నతమైన వ్యక్తులు గా మిగులుతారు.ఇప్పుడు మానసిక నిపుణులు కూడా వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ను మించిన పాఠం లేదని తెలియచేస్తున్నారు. భగవద్గీత లో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా బ్రతకాలి ? మంచి మార్గంలో ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక శ్రేయస్సు కు ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు చెప్పబడ్డాయి. ఇందులోని అంశాలు చదివి ఆచరిస్తే జీవితం తో పాటు లోకం కూడా స్వర్గధామం గా ఉంటుంది.గీతలోచెప్పబడిన ఉపదేశాలను ప్రతి వ్యక్తి తన నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత కచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకుంటుంది.ఒక్క భగవద్గీత ఎన్నో పురాణేతిహాసాలకు సమానం. అంటే అన్నీ ఇతిహాసాలు చదవనక్కరలేదు ఒక్క భగవద్గీత చదివితే చాలు, జీవిత పరమార్ధం తెలుస్తుంది. కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు మళ్ళించడమే గీత లక్ష్యం.
భగవద్గీత ద్వారా వ్యక్తిత్వ వికాసం; - :సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి