రంజాన్(మణిపూసలు);- చైతన్య
నిశ్శబ్ద జీవనానికి 
శాంతియుతా గమనానికి 
మొగ్గతొడిగె మాసమిది 
క్రమశిక్షణ పయనానికి!

తన నిద్రాహారాలను 
ఆగ్రహ ఆవేశాలను 
నియంత్రణ గొళ్ళమేసి 
దైవ ప్రేమకు తపించును!

పాపాలను పరిహరించి 
ఇహపర లోకాలనుంచి 
ప్రయోజన వరములిచ్చు 
శుభాకాంక్షల నందించి!
 
విశ్వాసుల తిరుగులేక 
దైవదూత సాక్ష్యమిoక 
దివిలోన మురిసిపోయె 
ఆకాశాన నెలవంక!

మానవతే పెల్లుబికెను 
సంపన్నుల మదికరిగెను
ఆకలి దప్పులు తీర్చగ 
దానాలే హెచ్చించెను!

మతగ్రంథమేదైనను 
తత్వమెల్ల ఒకటిగాను 
సామరస్య హారములై 
సౌభ్రాత్రం వికసించెను!



కామెంట్‌లు