కాగితాలను కాల్చుతున్నట్లు
కాదు
అక్షరాల యజ్ఞం అది!!
ఒక్కో అక్షరం మండి
నక్షత్ర మండలాలు అన్ని
సంచరిస్తాయి!!
వెండి బంగారంలా
కాగితము అక్షరము రెండు విడిపోయి
కాలం మెళ్ళో
ఆభరణాల్లా అలంకరించబడతాయి!!
నీవు కాల్చేసిన చరిత్రలు
సంకేతాలతో సరి చేయబడతాయి
కాలి బూడిదైనా
పార్తివ దేహంలా!!!
శరీరాల్ని విడిచినట్లు
కొత్త జన్మలెత్తినట్లు
ఆ గాలితోనే శాసించి
ఆ శరీరంతోనే చెట్టు
గీతల కాగితమై పుట్టింది!!
ప్రపంచ యుద్ధాలు అన్ని
ఆటంబాంబు అనుభంబులతో మొదలైనట్లు
మెదళ్లను పేల్చుకుంటూ పోతే
ప్రపంచమంతా అజ్ఞానం
అజ్ఞాతవాసం లోంచి
బయటపడ్డది అక్షరం!!!
విరిగిన అవయవాల్ని సరిచేస్తూ
కోల్పోయిన చూపును
కొత్తగా అమరుస్తూ
రెక్కలు పుట్టుకొచ్చి ఎగురుతున్న
అక్షరం
కాగితాన్ని మాత్రమే వదిలింది!!!
తెరలు తెరలుగా పొగలు కమ్మిన
మార్గంలో రెండు వైపులా
ఒక వర్షం కురిసినట్లు
దేహాలుగా బయలుదేరిన అక్షరం
ప్రతి ఉదయం
ఒక కొత్త దారిని ఒక కొత్త ఊరిని
ఆవిష్కరిస్తుంది!!
చీకటి పడిందని
ఇంటి తలుపులు మూసివేసి
లైట్లను ఆర్పి, వీధిలైట్లను వేసి న, సమాచారం
గాలిలా గదుల్లోకి వీధుల్లోకి
చొచ్చుకొచ్చిన అక్షరం!!!
అక్షరం ఒక కొత్త కొవ్వత్తి అయింది
వెలుగుల్ని నీడల్ని కన్నది
అద్దంలో చూసుకున్న అక్షరం
నిరీక్షించిన ప్రతిబింబాన్ని
కౌగిలించుకుంది!!
రాస్తున్న రాతలన్నీ
రాలిపోతున్న ఆకుల్లా మారకముందే
ప్రతి అక్షరం పత్ర హరితమై
స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది!!!
విడదీసిన
కాగితపు బూడిద ఇప్పుడు
దిగంబరా ఆదియోగి
విభూది అయింది!!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి