తమఇంటి అరుగుపైన కథ వినడానికి చేరినపిల్లలు అందరికి మిఠాయిలు పంచిన బామ్మ 'పిల్లలు తెలివితేటలు అనేవి ఏఒక్కరిసొంతంకాదు.మనం ఎదటివారిని మోసగించబోతే మనమే మోసపోఏప్రమాదంఉంది. ఎవరుతీసిన గోతిలో వాళ్ళే పడతారు అని మనపెద్దలు ఎప్పుడోచెప్పారు. ఈరోజు మీకు మోసగించడం అనేది ఎంతతప్పో తెలియజేసే కథచెపుతాను.
అవంతి రాజ్యంలోధనపాలుడు అనే కిరాణావ్యాపారి ఉండేవాడు.అతనికి చక్కటి అందమైన తెలివితేటలుకలిగిన కుమార్తెఉంది. అతని జాలిగుణాన్ని, మంచితనాన్ని అలుసుగా తీసుకుని సరుకులుఅప్పుతీసుకున్న తిరిగిచెల్లించలేదు. అలా అతని వ్యాపారం దివాలాతీసింది. తనుకిరాణా సరుకులు అప్పుతెచ్చిన షావుకారుకు ఐదువేలవరహలు బాకీపడ్డాడు.
తనకు ఇవ్వవలసిన ఐదువేలవరహలు వెంటనేచెల్లించాలి,అలా చెల్లించని ఎడల ధనపాలునికుమార్తెను తనకుఇచ్చి వివాహం జరిపించవలసినదిగా ధనపాలునిపై వత్తిడి తీసుకు వచ్చాడు షావుకారు.
ఈవిషయం తనకుమార్తెవద్ద ప్రస్తావించాడు ధనపాలుడు. 'బాధపడకండి నాన్నాగారు ఆపదసమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి.సమస్య ఎప్పుడు కొండలాకనిపిస్తుంది ధైర్యంతో సమస్యను ఢీకొంటేనే విజయం లభిస్తుంది.శతకోతి ఆపదలకు అనంతకోటి ఉపాయాలు.నిజాయితీగా తెలివితో ఎంతటి ఆపదనైనా సునాయాసంగా ఎదుర్కొనవచ్చు సమయం వచ్చినప్పుడు వచ్చిన ఆపదకు తగిన ఉపాయం ఆలోచిద్దాం'అన్నది.
కొద్దిరోజుల అనంతరం రచ్చబండ వద్ద,న్యాయమూర్తి ఎదుట గ్రామ ప్రజలందరుముందు పంచాయితీపెట్టిన షావుకారు ,ధనపాలుడు అతనికుమార్తెను పిలిపించారు. ' షావుకారు మంచివాడు కనక నీకు ఒకఅవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నావద్దనున్న చేతిసంచిలో రెండు గోళీలు ఉన్నాయి.వాటిలోఒకటి నల్లగోళి,మరొకటి తెల్లగోళి ఉన్నాయి. మీఅమ్మాఇనే సంచిలోనిగోళి ఒకటి తీయమనండి నల్లగోళి ఆమెచేతికివస్తే షావుకారును వివాహం చేసు కోవాలి,అదే తెల్లగోళి ఆమె చేతికివస్తే షావుకారును వివాహం చేసుకోనవసరంలేదు,పైగా బాకీపడిన ఐదువేల వరహలుకూడా రద్దు చేయబడతాయి' అన్నాడు న్యాయమూర్తి. ధర్మపాలునికుమార్తె న్యాయమూర్తి ప్రకటనలో ఏదోమోసంఉందని గ్రహించింది.
షావుకారు, న్యాయమూర్తికి బంధుత్వఉంది. ఆసంచిలో రెండు నల్లగోళీలే ఉన్నాయని ఊహించిన ఆమె,అఇష్టంగానే తలఊపింది. న్యాయాధికారే స్వయంగా ఆమెవద్దకువచ్చి కొద్దిగా సంచితెరచి ఒకగోళి తీయమన్నాడు. క్షణకాలంఆలోచించిన ఆమె సంచిలో గోళినితీస్తు ,బలంగా తుమ్ముతూ చేతిలోని గోళిని పక్కనే ఉన్న నేలబావిలో మెరువేగంతో వదిలింది.'పెద్దలు మన్నించాలి తుమ్ము ఆపుకోలేకపోయాను,పైగా వచ్చేముందు తలకు నూనెరాసుకున్నచేతుకావడంతో తుమ్మడంవలన గోళి చేజారి బావిలో పడింది. అదిపోతేపోయింది సంచిలో మరోగోళి ఉందిగా దాన్నిచూసి తమరు నిర్ణం తెలియజేయండి 'అన్నది.
'అవును ఆఅమ్మయి చెప్పినదే నిజం బావిలో పడినది ఏరంగు గోళినో తెలియాలంటే సంచిలో ఏరంగు గోళి ఉందో చూస్తే సరిపోతుంది'అన్నారు అక్కడి ప్రజలు.తనచేతిసంచిలోని గోళిని వెలుపలకుతీసాడు న్యాయమూర్తి.అదినల్లగోళి ,ఆనందంతో ఆగ్రామస్తుంతా కరతాళధ్వనులు చేసారు.తప్పుడు ఆలోచనచేసి అతితెలివి చూపినందుకు తనకు తగినశాస్తి జరిగింది అనుకుంటూ ఇంటిదారిపట్టాడు షావుకారు' అన్నబామ్మ, 'బాలలు తెలుసుకున్నారుగా న్యాయానిదేవిజయం' అన్నది.బుద్ధిగా తలఊపారు పిల్లల అందరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి