చిత్రకళలో ప్రవళిక అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
 చిత్రకారిణి ప్రవళికను అభినందించిన సినీ నిర్మాత, చేనేత వ్యాపారస్తులు మహంకాళి శ్రీనివాసులు
       అమరచింత పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి విద్యార్థిని నామాల ప్రవళిక తండ్రీ నామాల రవి చిత్ర కళలో జాతీయ,అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని అమర చింతకు చెందిన సినీ నిర్మాత, చేనేత వ్యాపారస్తులు మహంకాళి శ్రీనివాసులు అన్నారు.ఆదివారం ఆయన పట్టణానికి రావడంతో  పెన్సిల్ తో గీసిన ఆయన చిత్రపటాన్ని బహుకరించారు.దీంతో విద్యార్థిని సన్మానించి చేనేత కుటుంబంలో జన్మించిన ప్రవళిక చదువులో రాణిస్తూ, చిత్రకళలో ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించడం అభినందనీయమన్నారు. 
       విద్యార్థి ప్రవళిక తండ్రి నామాల రవి  చేనేత వ్యాపారస్తులు మహంకాళి శ్రీనివాసులు గారికి హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
       ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఎం. పాండు, చేనేత సంఘం సభ్యులు చంద్రమోహన్, శ్రీను,రవి, రాము ఉన్నారు.

కామెంట్‌లు