మనం సంఘజీవులు మనతోపాటు మనుషులే కాదు జంతువులు పక్షులు కూడా సహజీవనం చేస్తాయి.
పక్షులలో మొదటిది కాకి, రెండు కోడి, మూడు పిచుక, మిగతా అన్ని ఉంటాయి కానీ ఇంటి దగ్గరగా ఉండవు. వీటివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి.
చైనా వాళ్లు సంవత్సరానికి ఒక పిచ్చుక 6.5 కేజీలు ధాన్యం తింటాయని తెలుసుకొని ఆ ధాన్యాన్ని కాపాడితే 60 వేల మందికి ఆహారం దొరుకుతుందని సుమారు 30 లక్షల పిచుకలను చంపేశారు.
చెట్లు పైన ఉన్న పిచుకలని డబ్బాలతో కొట్టి చంపారు. గుడ్లని పగలగొట్టేసారు.
అలా చేయడం వల్ల ఏం జరిగిందంటే పంటలన్నీ పురుగులు పట్టి తినడానికి తిండి దొరక్క కరువు ఏర్పడింది (1958_ 61 లో).
సుమారు ,4. 5 కోట్లమంది తిండి లేక ఆకలితో మరణించారు.
నష్టం భర్తీ చేయడానికీ సోవియట్ యూనియన్ నుండి కొన్నివేల పిచ్చికులను దిగుమతి చేసుకున్నారు.
దీన్నిబట్టి ఏం తెలుస్తుంది సృష్టిలో ప్రతి ఒక్క జీవి సంఘానికి ప్రకృతికి ఎంతో అంతో ఎంతో కొంత ఉపకారం చేస్తాయి అని తెలుసుకోవాలి అందుచేత వాటికి ఇవ్వాల్సిన విలువలు వాటికి ఇచ్చి మనం కాపాడుకుంటే మనం హాయిగా జీవించవచ్చు. శుభం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి