జనాలు ఉంటేనే
జీవముంటుంది!
జనాలు లేని వీధి
జనాలు లేని ఊరు
నీరు లేని
నదిలా ఉంటుంది!!
జనాలు లేని వీధి వృధా
జనాలు లేని ఊరు వృధా!!
వీధి వీధి దారి దారంతా
జనాలు గోదారిలా
పారితేనే ప్రతి హృదయం
ఉప్పొంగుతుంది!!!
యంత్రమైనా మంత్రమైనా
మనిషైనా మనిసైనా
పదిమందిలోనే మన మది
వికసిస్తుంది!!!
గగనమైన భూభాగమైన
చిగురించేది పువ్వై పుష్పించేది
పచ్చని చెట్టుకే జనాల జట్టుకే!!!
బస్టాండ్లలో ఆసుపత్రుల్లో
రైల్వే స్టేషన్లలో థియేటర్లలో
జాతర్లలో జనాలున్నట్లు
బజార్లలో కూడా జనాలు ఉంటే
అది ఊరైనా భాగ్యనగరమే
లేకుంటే
అది ఊరైన కారాగారమే
ఒక కర్మగారమే!!!?
జనాలు లేని
జర్మనీ అయినా జపాన్ అయినా
అమెరికా అయినా లండన్ అయినా
ఒకటే!!!
జనాలున్న
చైనా ఇండియా ఒక్కటైనా ఒకటే!!!?
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి