* కోరాడ మినీలు *

     @ అవతరణ... !
               ***
శ్రమ భరించలేని అణచివేతకు, అన్యాయానికి గురై.... తిరగబడిన ఫలితమే... మే డే యై అవతరించింది... !
               ****
         * పిడికిలై బిగిసి.... !*
          *****
శ్రామిక శక్తి మేల్కొన్న రోజు... 
  రక్తంతో తడిసిన ఎర్ర జెండాయై ప్రపంచ కార్మికులను ఒక్కటిచేసి.... పిడికిలై బిగిసి పైకి లేచింది..... !!
          *****
       . @ పైశాచికం.... !
           *****
కర్షక, కార్మిక, శ్రామికులు.... 
ప్రగతిపద రధ సారధులు !
ఆనందనందనవనసమాజ  నిర్మాతలు !!
     కష్టం వారిదే ఐనా... సుఖాలను అందరికీ అందించాలనే తలచే వారు... వారిని బాధించి సుఖాలతో ఆనందించటం... మానవత్వమా... పైశాచికం !
         ******
       * పిడికిలై పైకి లేస్తారు *
      ... *****
విశాఖ ఉక్కు... ఎందరో త్యాగధనుల శ్రమ ఫలం !
ఇది ఈ ప్రజల ఆస్తి, హక్కు.... 
తేరగా ఎవరికో ఇచ్చేస్తామంటే చేతులుకట్టుకు కూచుంటారా పిడికిలై పైకి లేవరూ..... !!
      *******
కామెంట్‌లు