ఆశల అడుగుల చప్పుడు
అంతరంగంలో ఆలకించిన
ఆత్రం
అందాలు చిందే సీమల
ఆహ్వానం అందుకోవాలని
ఆరాటం
ఈ లోకాన్ని నందనంగా
భావించి నిలువెల్లా
తృప్తితో జీవించే
ఆనందం
అణువణువూ పులకరించు
పలకరింపులు నిండిన
ఆత్మీయత
పాలమబ్బుల పల్లకిలో
అమృతం చిలికిస్తూ
జగాలను మేలుకొలిపే
చైతన్యం
తారాడే కోరికల
తారా తోరణంలా
మది నింగిని మెరిసే
అద్భుతం
వెలుగుల వానలో
ఇలను తడిపేసే
ఇనుడి అనుగ్రహం కోసం
ఆకాంక్షలు
అంచెలంచెల అనుభూతుల
ఆవృతాలైన జీవిత గమనాన
అనవరతం తోడుండే
వెలుగుల దైవానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి