బావా బావా బంతీపువ్వా
బూందీ లడ్డూ చేద్దామా
అత్తా అత్తా అరటిపువ్వా
అత్తిరసాలు చేద్దామా
మామ మామ మంకెనపువ్వా
మరమరాలు చేద్దామా
తాత తాత తామరపువ్వా
తాటాకు పందిరి వేద్దామా
నాన్న నాన్న నారింజ పువ్వా
నెమలి ఈకలు తెద్దామా
అమ్మా అమ్మా ఆకాశ మల్లె
అలంకరణలు చేద్దామా
పువ్వులను మాలగచేసి
దేవుడి మెడలో వేద్దామా
పదార్దాలను ప్రసాదంగా
పదుగురికి పంచేద్దామా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి