సాహిత్యాకాశంలో
సతతము వెలుగుతున్న రవి
కవులందరికి మార్గదర్శి
మాన్యులు శ్రీశ్రీ మహాకవి
తనదైన శైలిలో మరో
ప్రపంచం సృష్టించెను
పద విన్యాసాలతో
తెలుగు తెగువ చూపించెను
కమ్మని కవిత్వంతో
హృదయాలను దోచినారు
తెలుగువారి గుండెల్లో
దైవమై నిలిచినారు
ప్రాణాలే పోశారు
శ్రీశ్రీ విప్లవ గీతాలకు
చైతన్యమే తెచ్చారు
శ్రామికుల జీవితాలకు
నేర్పారు అక్షరాలకు
సాహిత్య వనంలోన
తపస్సు చేశారు కనుక
అక్షరాభిషేకాలు
శ్రీశ్రీ మహనీయులకు
వారి జయంతి వేళ
వందనాలు చరణాలకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి