అందరికీ ఒకటే ఉదయం
చూసే మనసులే తేడా..
అదొక అవకాశం అందరికి
అదొక ముందడుగు పయనంలో..
సమయానికి సమయం లేదు
మన మనసును వినడానికి
అసలు వెనకాడం కష్టాలకు
దైవమే కారణం అనడానికి..
అన్నీ అప్పనంగా చేతికి
అందొస్తే దేనికోసం
ఆరాటపడాలి?
ఇష్టంగా పోరాడాలంటే
తీరని కోరికంటూ వుండాలి
చిన్ని నీటి బిందువు
కొలనిలో పడితే
ఉనికి కోల్పోతుంది
అదే గులాబీపై పడితే
అందంగా నిలబడుతుంది
అందరికీ అవే క్షణాలు
అవే రోజులు
ఆస్వాదించే వారికే అవి
అపురూపాలు.
గమనాన్ని జ్ఞాపకంగా
దాచుకుంటూ
చిన్ని చిన్ని సరదాలతో
సరాగాలు పాడుతూ
జీవిస్తూ జీవించేదే జీవితం
గొప్పగా గడిపే క్షణాలను తెచ్చే
ఉదయానికి ఉత్సాహంగా
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి