త్యాగరాయగాన సభలో ' ప్రసాద్' కు ఆత్మీయ సత్కారం

   పినాకిని యూత్ వేల్ఫర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో
కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్  రసాయనశాస్త్ర విశ్రాంతశాఖాధిపతి విశాఖపట్నం  ' శరణాగతి ధరిత్రీ మాత' అన్న కవిత చదివిన సందర్భంగా సభాధ్యక్షులు పద్మశ్రీ ఆచార్య కొలకులూరి ఇనాక్ గారు పూర్వ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ,ముఖ్యఆతిధి
పూర్వ సి.బి.ఐ జాయింట్ డైరక్టర్ శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ గారు,గౌరవ అతిధులు  సినీ దర్శకులు రేలంగి నరసింగరావు  గారు 
శ్రీ  మహేష్ చంద్ గారు , డాక్టర్ నిట్టల గోపాలకృష్ణ గారు ,బంగారు నంది పురస్కార గ్రహీత  సినీ గేయ రచయిత శ్రీ సాధనాల స్వామి నాయుడు గారు మరియు   కవి శ్రీ విరూపాక్ష స్వామి గారు శ్రీశైలం దేవస్థానం సభ్యులు గారిచే హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో  ఉత్తమ సామాజిక కవితగా అభినందన ప్రశంసా పత్రం మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు.  పినాకిని సంస్థ అధ్యక్షులు కె. మురళి మోహన్ రాజు కార్యనిర్వాహక సభ్యులు
అభినందలు తెలియచేసారు .సాహితీ మిత్రులు మరియు శ్రేయోభిలాషులు ప్రసాద్ మాస్టరు కి శుభాకాంక్షలు తెలియచేసారు.
...........................
కామెంట్‌లు