శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 పతంజలి తనమహాభాష్యంలో ఆభీరులను గూర్చి పేర్కొన్నాడు.మహాభారత కాలంలో వారు పంచనద్ లో ఉండేవారు. ఆరోజుల్లో వారికి సంఘంలో అంత గొప్ప స్థానంలేదు.కురుక్షేత్ర నుంచి బ్రజ్ కి తరలివచ్చారు. అదే శూరసేన జనపదం.బ్రజ్ అంటే గోచరమైనభూమి అని అర్ధం. వీరినే గోప గ్వాల్ గ్వాలా అని పిల్చేవారు. 7వశతాబ్ది తర్వాత వీరు బలవంతులై మధ్యప్రదేశ్ లో ఓస్వతంత్రరాజ్యాన్ని నెలకొల్పారు. గ్వాల్ అనే పేరు మీదుగా గ్వాలియర్ వచ్చింది.ఆభీరులుకూడా వచ్చి వీరిలో కల్సి పోయారు. క్రమంగా ఆభీరులు కఠియవాడ్ ప్రాంతం చేరారు. పారావతీ బేత్వా నదులమధ్యప్రాంతంని అహీర్ వాడ్ అన్నారు. 
గోత్రంకి అర్ధం గోశాల పసులగుంపు దుర్గం అని!ఛాంద్యోగ ఉపనిషత్తుల్లో గోత్రం అంటే కుటుంబం జనం అనే అర్ధం లో వాడబడింది.తండ్రి కొడుకు మనవడిని కల్పి గోత్రం అంటారు.

కామెంట్‌లు