*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0263)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శంఖచూడుని తో వీరభద్రుని యుద్ధం - భద్రకాళి దానవరాజుతో భయంకరమైన యుద్ధం చేయడం - అశరీరవాణి ని విని భద్రకాళి యుద్ద భూమి వదలి వెళ్ళడం - విష్ణు దేవుడు రాక్షస రాజుతో యుద్ధం - తులసి శీల హరణం - త్రిశూలముతో శంఖచూడుని వధ - శంఖోత్పత్తి......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! తన వద్దకు వచ్చి భద్రకాళి చెప్పిన యుద్ధ వృత్తాంతము, అశరీరవాణి పలుకులు విన్న శంకరుడు, శంఖచూడుని సంహరించుటకు యుద్ధ భూమికి కదిలారు. అప్పుడు శంకరుని వెంట వీరభద్రుడు, భైరవుడు, క్షేత్రపాలురు మొదలగు వీరులు అందరూ కదిలారు. వీరరూపం ధరించిన మహేశ్వరుని రణభూమిలో చూసిన శంఖచూడుడు తన విమానము దిగి సాష్టాంగ నమస్కారం చేసాడు. వెంటనే, తన విమానము ఎక్కి, ధనస్సు చేతిలోకి తీసుకొని మహేశ్వరుని పైకి పెక్కు బాణాలు వదిలాడు. మహేశ్వరుడు కూడా బాణాలు సంధించారు. వీరిద్దరి మధ్య యుద్ధం కొన్ని వేల సం.లు జరిగింది. కానీ, నిష్ఫలితమే. అప్పుడు, త్రినేత్రుడు తన త్రిశూలమును చేతబూనాడు, దానవ రాజును అంతమొందించడానికి.*
*త్రిశూలధారియై శంకచూడుని మీదకు వెళుతున్న శంభుని చూచి, అశరీరవాణి "మహేశా! నీవు ఎటువంటి వారినైనా క్షణ కాలంలో మట్టు పెట్టగల వాడవు. నీకు ఈ దానవ రాజు ఏమాత్రం సముజ్జీ కాడు. అదీ కాక, దేవతల మర్యధ కూడా నీవు కాపాడాలి. బ్రహ్మ వర ప్రసాదమైన కవచం, అతని పతివ్రతామ అయిన భార్య తులసి అండదండలు ఉన్నంత వరకు, మీరు ఈ రాక్షస రాజు ను జయించ లేరు. కనుక, బ్రహ్మ మాటలనుబసతగయము చేస్తూ, మీ త్రిశూలము ను ఉపసంహరించండి" అని పలికింది. అప్పుడు, త్తినేత్రుడు, విష్ణువు సహాయం కోరగా, విష్ణువు శంకరుని పని పూర్తి చేయడానికి శంఖచూడుని దగ్గరకు వెళ్ళారు.*
*బ్రాహ్మణ వేషంలో శంఖచూడుని వద్దకు వచ్చి విష్ణుమూర్తి, "దానవరాజా! నాకు బిక్ష ఇవ్వడానికి నీవు అంగీకరిస్తే, నా కోరిక నీకు చెబుతాను" అన్నారు. రాక్షస రాజైన శంఖచూడుడు బ్రాహ్మణ భక్తుడు, సత్యవాది, ఐశ్వర్యశాలి. త దానం ఇవ్వడానికి తన అంగీకారం తెలపాక, బ్రాహ్మణుడు తనకు దానంగా , దానవ రాజు కవచం కావాలి" అని అడిగాడు. ఏమాత్రమూ సంకోచించకుండా, దానవ రాజు, బ్రాహ్మణ వేషంలో ఉన్న విష్ణుమూర్తి కి తన కవచం ఇచ్చేసాడు. దానం గ్రహించిన విష్ణుమూర్తి, అక్కడి నుండి శంఖచూడుడు గా మారి పతివ్రతామతల్ల అయిన తులసి వద్దకు వెళ్ళి ఆమె శీలము అపహరిస్తాడు. శంభునికి తన కార్య సఫలత వివరిస్తాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు