*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 100*
 కందం:
*ఋణ మధిక మొనర్చి సమ*
*ర్పణ చేసిన తండ్రి విద్యరాని కొడుకు ల*
*క్షణశాలి రాణి దుశ్చా*
*రిణి యగు జననియును దలప రిపులు కుమారా !*
తా:
కుమారా! ఎక్కువ మొత్తం లో అప్పు చేసి, ఆ ప్పును తన సంతానికి బహుమతి గా ఇచ్చిన తండ్రి, చదువు కోని సంతానం, అందమైన భార్య, చెడు ప్రవర్తన కలిగిన తల్లి, ఈ నలుగురుని తమ శతృవులుగా సమాజంలో భావిస్తారు.............. అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*తల్లిదండ్రులు తమ శక్తికి మించి సదుపాయాలు కల్పించినా చదువు కోకుండా, చెడు తిరుగుళ్ళు తిరిగే పిల్లలు వారి ఇంటికి మాత్రమే కాదు, సమాజానికి కూడా చెడు చేస్తారు. అలాగే, విలువలు లేని జీవితం గడిపే ఎవరైనా సమాజానికి నష్టం చేసేవారే. అప్పుల ఊబిలో కూరుకుపోయున వ్యక్తి కానీ, సమాజం కానీ ఉన్నతిని చూడలేదు. అభివృద్ధి కనబడదు. కనుక, ఒక ఇంటిలో ఉన్న సభ్యులు అందరూ బాధ్యతగా మెలగడం ఎంత అవసరమో, ఒక సమాజంలో ఉన్న అందరూ కూడా బాధ్యతతో ఉండడం కూడా అంతే అవసరము. అందువల్ల, మనమందరం, మన సమాజం పట్ల, మన ఇంటి పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా ఉండగలిగే మంచి మనసు, వ్యక్తిత్వం ఇవ్వమని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు