పుట్టింటి నేల మట్టి; -డా.నీలం స్వాతి--చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పుట్టింది అక్కడే,
పెరిగింది అక్కడే,
బుడిబుడి అడుగులు 
వేసిందీ అక్కడే,
బడికి పరుగులు 
తీసింది అక్కడే,
అల్లరి చేసింది అక్కడే,
ఆటలాడిందీ అక్కడే,
అమ్మ ప్రేమను,
నాన్న లాలనను 
పొందింది అక్కడే,
సరదాల సంబరాల
సంతోషాలను 
చూసిందీ అక్కడే,
పువ్వునై  విచ్చింది అక్కడే,
పరిమళించింది అక్కడే,
పుట్టింటిని వీడింది,
అత్తారింటికై సాగింది అక్కడే,
అత్త అమ్మలా అభిమానించినా,
భర్త ఎంత ప్రేమను పంచినా,
నేను మాత్రం ఇక్కడే,
నా మనసు మాత్రం ఇప్పటికి ఎప్పటికీ అక్కడే...


కామెంట్‌లు