ఆరోగ్యం కోసం;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.6302811961.
 ఆ రోజులలో  పద్ధతి ఎలా ఉండేదంటే నేలను ఆవు పేడతో అలికే వారు ఆవు పేడకు క్రిమి సంహారక శక్తి ఎక్కువగా ఉంటుంది  దానిపైన చాప వేసి ఒక పంక్తిగా  ఆ కుటుంబంలో ఉన్న వారందరూ వరుసగా కూర్చుంటారు  అందరూ కూర్చున్న తర్వాత  విస్తరులు వేస్తారు. అరటి ఆకులను వేయడం వల్ల  వడ్డనలో ఏదైనా విష పదార్థం కలిసినట్లయితే ఆ విషయం  ఆ ఆకు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఎలా అంటే దాని రంగు మారుతుంది  ఆ ఆకు రంగు ఎప్పుడు మారిందో అప్పుడు వెంటనే ఆ గృహిణి  ఆ ఆకుని బయటికి తీసివేస్తుంది  ఇప్పుడు మనం పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్ళినప్పుడు  ఎవరి బొచ్చి వారు పట్టుకోవడం  ఏ పదార్థం ఎక్కడ ఉన్నది  వెతికి అక్కడకు వెళ్లి వడ్డించమని  బొచ్చిని చాపటం  మాతా కవళం అన్న  బిచ్చగాని వలె  ఆ పద్ధతి  చాలామంది అనుభవంలో వచ్చి ఉంటుంది.
గృహిణి వడ్డించేటప్పుడు పట్టు చీరలు మాత్రమే ధరించాలి  ఆమె వడ్డించుకుంటూ వెళ్లేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి  శరీరానికి చెడు చేసే క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది  పూర్తి భోజనం అన్న శుద్ధికి ఒక  నేతి చుక్కను వడ్డించి వెళుతుంది  ఇక మీరు కూర్చోండి అని చెప్పిన తర్వాత మాత్రమే వాడు భోజనానికి ఉపక్రమిస్తారు  అప్పుడు వీరు ఆపోసన పట్టడం  దానివల్ల ఆ నీటిని త్రాగి ఏ క్రిమి విస్తరిలోకి రాకుండా పూర్తి భోజనం అయిపోయిన తర్వాత  అంత్య ఆపోసన కూడా అయిపోయి  తృప్తస్మి  నాకు చాలా తృప్తిగా భోజనం పెట్టావ్ అమ్మ అని ఆ గృహిణిని అభినందించి  అప్పుడు లేస్తారు  పద్ధతి ప్రకారం  జరిగే ఆక్రియ బాగుంటుందా ఇప్పుడు మనం చేసేది బాగుంటుందా అనేది ఆలోచించుకుని చేస్తే  మనం ఏది ఆచరించాలో దానిని ఎన్నుకోవడం మన వంతు అవుతుంది. ఇవాళ మీరు ఏ ఇంట్లో నైనా గమనించండి  భార్యా భర్తలు గాని  కుటుంబం మొత్తం కానీ భోజనం చేస్తున్నప్పుడు  ఓ ప్రత్యేక స్థానంలో కూర్చుని చేయడం  ఎక్కడైనా ఉన్నదా  టీవీ చూస్తూనే భోజనం చేయాలని మారంచేసే పిల్లలు  పెద్దవారికి కూడా ఏవైనా కొత్త వార్తలు వస్తాయేమో నన్ను ఆశతో  అలా చూస్తూ భోజనం చేయడంలో  ఏమాత్రమైన ఆనందం కానీ  ఆరోగ్యానికి సంబంధించిన విశేషం కానీ జరుగుతుందా  ఇది అందరకు తెలిసిన విషయమే  అయినా ఎవరూ పట్టించుకోరు  దానికి కారణం  అనేక రకాల మాధ్యమాలు మన ముందుకు వచ్చి ఉన్నాయి  అవి లేకుంటే ఏ వ్యక్తికి ఓ క్షణం కూడా  జరగదు అన్న స్థాయిలో వాటికి ప్రతి ఒక్కరూ బానిసలు కావడం ముఖ్య కారణం  ముందు ఆరోగ్యం తర్వాత కదా  ఆనందం అది మర్చిపోతున్నాం.


కామెంట్‌లు
Kavi చెప్పారు…
బాగా చెప్పారు..బ్రాహ్మణులు జరిపే వేడుకలలో ఇంకా బొచ్చె విధానం రాలేదు..దానికి సంతోషించాలి

కె.కవిత
హైదరాబాద్