కలువ కళ్ళతో,
చిలిపి చిరునవ్వుతో,
జాబిలి నగుమోముతో,
సొగసైన సొట్టబుగ్గలతో,
ముద్దొచ్చే సిగ్గుతో,
పగడాల పెదవులతో,
తీయతియ్యని మాటలతో,
వయ్యారి నడకతో,
ఊగే వాలుజడతో,
కొప్పున పువ్వులతో,
కాలి మువ్వలతో
పగలంతా పనిగట్టుకొని
నన్ను ఊరిస్తావే....
రాత్రి అవ్వగానే కలలా
మారి నన్ను కవ్విస్తావే....
అసలు, నువ్వు ఏం మాయ చేసావో
తెలియదు కానీ??
నీ మాయలో నాకు
ఏం అయ్యిందో తెలియదు కానీ??
నా చూపు- నిన్నే కోరింది...
నా మాట-నీ పేరే పలికింది...
నా అడుగు-నీ వైపే సాగింది....
నా ప్రేమను మన్నించి
ఓ ప్రియా నువ్వు నన్ను చేరగా.....
నిదరోతున్న నా బుజ్జి హృదయం
నా చెలివైన, నీ చేతుల తొలి తాకిడికి
లయగా మారి స్పందించడానికి సిద్ధంగా ఉంది...
చిలిపి చిరునవ్వుతో,
జాబిలి నగుమోముతో,
సొగసైన సొట్టబుగ్గలతో,
ముద్దొచ్చే సిగ్గుతో,
పగడాల పెదవులతో,
తీయతియ్యని మాటలతో,
వయ్యారి నడకతో,
ఊగే వాలుజడతో,
కొప్పున పువ్వులతో,
కాలి మువ్వలతో
పగలంతా పనిగట్టుకొని
నన్ను ఊరిస్తావే....
రాత్రి అవ్వగానే కలలా
మారి నన్ను కవ్విస్తావే....
అసలు, నువ్వు ఏం మాయ చేసావో
తెలియదు కానీ??
నీ మాయలో నాకు
ఏం అయ్యిందో తెలియదు కానీ??
నా చూపు- నిన్నే కోరింది...
నా మాట-నీ పేరే పలికింది...
నా అడుగు-నీ వైపే సాగింది....
నా ప్రేమను మన్నించి
ఓ ప్రియా నువ్వు నన్ను చేరగా.....
నిదరోతున్న నా బుజ్జి హృదయం
నా చెలివైన, నీ చేతుల తొలి తాకిడికి
లయగా మారి స్పందించడానికి సిద్ధంగా ఉంది...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి