మన్ కి బాత్(మణిపూసలు);- పి. చైతన్య భారతి, 7013264464
మనసులోని మాటకు 
వందొవ ఎపిసోడుకు 
నమో నమో ప్రభంజనం 
జై భారత బిడ్డకు!

ఓ మహా ఋషితుల్యుడు 
మోది కారణ జన్ముడు 
భరతమాత వైభవాన్ని 
ఖండాoతర వ్యాపకుడు!

నిజాయితీ గలిగిన 
సమర్థతా నిండిన 
శాంతి స్వరూపమితడు 
సచ్ఛీలత అమరిన!

దూరదృష్టి కలిగినాడు
ఎదురే లేని నాయకుడు 
విస్తృత జ్ఞానం కలిగిన 
రాజకీయ దురంధరుడు!

దృశ్య మాధ్యమాన్ని మించి 
రేడియోనే తానెంచి 
ప్రజలకు చేరువయ్యాడు 
ఆటంకాలధిగమించి!

అంతర్జాల యుగంలో 
మారుమూల గ్రామాల్లో 
ఎదయెదలో నిలిచాడు 
మాట చేరవేయుటలో!

ఎనిమిదేళ్ళ క్రితం మొదలు 
ఎన్నో అంశాల చర్చలు 
ప్రజల ముందుబాటకు 
అయ్యెనుగ సఫలీకృతులు!

కరోనా సమయంలో 
రాకాసి విలయంలో 
'దో గజ్ కి దూర్' అంటూ 
సూచించె మన్కి బాత్ లో!

శుద్ధమైన సంకల్పము 
స్వచ్ఛభారత్ మార్గము
చైతన్యం కల్గించిన 
ప్రజారోగ్య ఘనసూత్రము!

వాక్సిను ప్రాధాన్యతను 
పలుమార్లు బోధించెను  
ధైర్యాన్ని నూరిపోసి 
మరణాలనరికట్టెను!

అమృతోత్సవం సంబరం 
చుంబించేను అంబరం 
హర్ ఘర్ తిరంగా యను 
నినాదమైంది అబ్బురం!

ప్రజల నాడి పట్టుకొని 
ప్రభుత్వ బాధ్యతేయని 
మన్ కి బాత్ చూరగొంది 
మోది గారి  ప్రేరణని !

రాజకీయాల కతీత 
మైన నిజాయితీ నేత 
ప్రత్యేక పంథాలో
పయనించే ప్రజానేత!

పట్టెను నీరాజనాలను 
ఐక్యరాజ్య సమితిలోను 
ప్రత్యక్ష ప్రసారముతో
ప్రతీ గుండెను తాకేను! 

సేవచేయు ఆలోచన 
ఉండినచో లోలోతున 
అసాధ్యాన్ని సుసాధ్యమని 
నిరుపించె పనులతోన!


కామెంట్‌లు