నగరవాస పిల్లలం; - గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
కోల్కత్త కోట ప్రకారం పిల్లలం
లోకసత్తా శ్రీకారం మల్లెలం
లోకాన్ని చదివేసిన వారలం
శోకాన్ని వదిలేసిన పోరలం !

మేం కోల్కత్తకోటలో జన్మించాం
మా మేనత్త మాటనే మన్నించాం 

మాటలోని మర్మాన్ని గమనించాం
తేట తెల్లం చేసుకొని ఆనందించాం

నగరం నడి బొడ్డున మా కొట్టును పెట్టాం
ప్రారంభోత్సవ జండాలను  ఇష్టంతో కట్టాం
సరుకులన్నింటిని అందుబాటులో పెట్టాం
 అమ్మకాల వ్యవహారాలకు నడుం కట్టాం!

రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాం
రాయల్ సంపాదనకే ప్రతినిత్యం చూస్తాం
కలిసొస్తే మేం కాలు మీద కాలు వేస్తాం
శుభస్య శీఘ్రం మా లాభాలను చూస్తాం!

మ్యారేజ్ డాట్ కామ్ ప్రారంభిస్తాం
వధూవరులను పరిచయం చేస్తాం
కళ్యాణం కమనీయమని గుర్తిస్తాం
అతిధుల ఆహ్వానించి జరిపిస్తాం !

అనువైన అడ్డ కోసం మేము చూస్తాం
కాంప్లెక్స్ కట్టడానికి చక్కని ప్లాన్ వేస్తాం
నిర్మాణానికి వెంటనే  ముగ్గుని వేస్తాం
మా కన్న కలలను మేము నిజం చేస్తాం!

మా బుర్రలోని ఆలోచనలను పెట్టాం మీ ముందు
సహకరించి చేయాలి మీ సహాయం  మునుముందు
మీ యత్నం ప్రయత్నానికి మా ఎదురుచూపు
చేస్తారన్న నమ్మకంతో ఉంటాం మేం రేపు మాపు !

ఇదేనండి మా నగర జీవన విధానం
సదా అవుతుంది మాకిదే ప్రధానం
ఇప్పడు మీకాయనుగా  అవగతం
ఎప్పటికీ చెబుతాం మీకు స్వాగతం !

కామెంట్‌లు