మానవులకు ప్రాణవాయువును అందించి వారి జీవితాలకు ఆయువును పోస్తున్నది చెట్లు అవి అడవులలో పెరుగుతూ ఉంటాయి మానవుడు ఆ చెత్తను నరికి తాను జీవించడం కోసం తన ఇల్లు కట్టుకోవడం ఆ స్థలాన్ని పొలం గా మార్చి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించి చివరకు అడవులు లేకుండా చేసే స్థితికి వస్తున్నాడు దీనివల్ల ఏం జరుగుతుంది మానవునికి కావలసిన ఆక్సిజన్ (ప్రాణవాయువు) దొరకటమే అబ్బురంగా ఉంటుంది ఆ స్థితి రాకుండా ఉండాలంటే మానవులలో చైతన్యం పెరిగి తన ఇంటి ఎదురుగా తనకు కావలసిన చెట్లను పెంచడం అలవాటు చేసుకుంటే ఆ కుటుంబం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తారు అనడంలో ఎలాంటి అభ్యంతరము లేదు. ఒక చెట్టు కావాలి అంటే దానికి ముందు బీజం వేయాలి దానికి నీరు పోసి మొక్కగా మారిన తర్వాత దానిని రక్షించుకుంటూ చీడపీడలు పట్టకుండా చూసుకుంటూ వృక్షం అయ్యేలా దానిని సాకాలి ఈ చెట్టు మొత్తానికి మూలం కాండము అది ఎంత బలంగా ఉంటే అన్ని కొమ్ములు ఎక్కువగా ఆ చెట్టుకు వస్తాయి అవి ఎన్ని ఎక్కువ కొమ్మలు ఉంటే అన్ని ఎక్కువ ఫలాలు మన చేతికి వస్తాయి అన్ని కొమ్మలలో నుంచి వస్తే కానీ మన జీవితాలు నిలువవు ఆ పండ్లు మన ఆకలిని తీర్చవు వేళ్ళకు నీళ్లు అందక వేళ్ళు ఎండిపోతే కాండం తప్పకుండా ఎండుతుంది అది ఎండిన మరుక్షణం మిగిలిన కొమ్మలన్నీ వెళ్ళడానికి ప్రారంభిస్తాయి కనుక మూలాన్ని ఎప్పుడూ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అలా చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నాడు ప్రేమలో అలాగే విద్యార్థి దశ నుంచి తాను విద్యను అభ్యసించాలన్న కోరిక మనసులో వేల్ళూరితే కానీ కాండం బలపడడానికి మంచి గురువు కావాలి ఆ గురువును ఎన్నుకోవడంలోనే శిష్యుని ప్రజ్ఞ తెలిసిపోతుంది గురువు ఉపదేశం చేయాలి ఊరికే అక్షరాలు చెప్పినంత మాత్రాన వారికి కానీ వీరికి కానీ ఎవ్వరికి ప్రయోజనం ఉండదు సత్ ఏదైతే ఉన్నదో శాశ్వతమైనటువంటి ఎలాంటి మార్పులు లేనటువంటి పదార్థాన్ని గురించి గురువుగారు చక్కగా బోధించినట్లయితే ఆ సద్బోధ వల్ల విద్యార్థి మానసిక స్థితి పరిణతి చెంది తాను చేరవలసిన స్థితికి చేరుకుంటాడు అలా కాకుండా జరిగితే ఆ చెట్టుకు జరిగిన స్థితి ఇతనికీ జరుగుతుంది అని చెబుతున్నాడు వేమన మరి ఆ వేమన రాసిన ఆటవెలదిని చదవండి మీకే తెలుస్తుంది.
"గురు శిష్యులనుగ కొమ్మలు గురువును గానంగా వేరు గురువరుడెంతో పరముడంచి యుండు నిత్యము ధరలోపల మనుజులెల్ల తలపరు వేమ..."
"గురు శిష్యులనుగ కొమ్మలు గురువును గానంగా వేరు గురువరుడెంతో పరముడంచి యుండు నిత్యము ధరలోపల మనుజులెల్ల తలపరు వేమ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి