విజయం చేకూరే వరకు;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.
 విజయం చేకూరే వరకు విశ్రమించవద్దు 
బతుకులు నడిపించే  జీవప్రవాహంలో నది గుర్తులు
అక్షరాల యాదిలో మది తలపులు 
ఎంత గొప్ఫ చైతన్య కరదీపిక
మనిషి చెట్టు నడిచీ నడిపించే
కొంగొత్త గొప్ప స్ఫూర్తి దారి 
ఇది కురిసే చినుకుల చెమట  
విసిరిన కార్మికుని శ్రామిక ధైర్యం
ఇది వెన్నుతో నిలిచిన శక్తి ఉద్బోధ   
 ఊపిరి కొలిమి కొలిచే కాల దైర్ఘ్యం 
ఇది కవితల కాగితం కాదు
శ్రీశ్రీ కలం రాసిన ఆటోగ్రాఫ్ నాకు 
'విజయం చేకూరే వరకు విశ్రమించవద్దు'
ఎంత విలువైందీ వాక్యం 
మహాకవి శ్రీశ్రీ ఆలోచనల దర్పణం

కామెంట్‌లు