రుబాయీలు ; -ఎం. వి. ఉమాదేవి
సామాజిక చేతనలో కార్మికుడే వేగుచుక్క
ప్రామాణిక భావనతో శ్రామికుడే వేగుచుక్క
చెమటచుక్కలనే కార్చి చేయువస్తు నిర్మాణం 
అనునిత్యo పనులమీద ప్రేమికుడే వేగుచుక్క!!

కాలుమీద కాలేసే కామందుకి దాసోహం
శ్రమకి విలువ ఇస్తారని అనుకోడం సందేహం
తూరుపు సూరీడుతోటి తొలిసేవలు పంచుతారు 
పిడికిలినే బిగించారు శ్రమజీవుల సందోహం!!
.............

కామెంట్‌లు