నవ్వులూ - పువ్వులూ : గంగదేవు యాదయ్య

 నవ్వుతాయి నవ్వులూ
నవ్వుతాయి పువ్వులూ...
నవ్వుతాయి సల్లగా
నవ్వుతాయి  తెల్లగా...
నవ్వుతాయి నవ్వులూ
నవ్వుతాయి పువ్వులూ...
నవ్వుతాయి నచ్చగా !
నవ్వుతాయి పచ్చగా...!
నవ్వుతాయి నవ్వులూ
నవ్వుతాయి పువ్వులూ...!
నవ్వుతాయి హాయిగా
నవ్వుతాయి వేయిగా ...! 
నవ్వుతాయి నవ్వులూ
నవ్వుతాయి పువ్వులూ...!
నవ్వుతాయి బిర్రుగా ...
నవ్వుతాయి ఎర్రగా...! 
నవ్వుతాయి  గాఢంగా ! 
నవ్వుతాయి నీలంగా...! 
నవ్వుతాయి నవ్వులూ
నవ్వుతాయి పువ్వులూ...
నవ్వుతాయి  సింగారంగా! 
నవ్వుతాయి బంగారంగా...! 
నవ్వుతాయి నవ్వులూ ...
నవ్వుతాయి పువ్వులూ...! 
నవ్వుతాయి దండిగా...
నవ్వుతాయి వెండిగా...!
నవ్వుతాయి నవ్వులూ ...
నవ్వుతాయి పువ్వులూ...! 
నవ్వుతాయి గొప్పగా....
నవ్వుతాయి  గుప్పుగా...! 
( రచయిత: ఉయ్యాల- జంపాల పిల్లల పాటలు పద్యాల పుస్తకం)
కామెంట్‌లు