విడదీయలేని బంధం... !- .కోరాడ నరసింహా రావు.
*నేడు  టీ దినోత్సవం *
         *****
నిదురనుండి లేవగానే... 
  బద్దకాన్ని వదిలించి.... 
    హుషారుగా కదిలించేది... 
     వేడి - వేడి టీయే కదా !!

చేయుచున్న పనులలో... 
  చురుకుదనము చేకూర్చి 
    ఉత్పత్తిని పెంచును.... 
      చక్కని -చిక్కని "టీ" యే..!!

చిక్కని పాలను వేడిచిసి... 
  మంచి " టీ " పొడినే వేసి 
     తల - తల మరిగేటప్పుడు 
   దంచిన అల్లం ఏలకులనువేసి 
     వడకట్టిన ఆ వేడి" టీ " ని 
     చప్పరిస్తు తాగుతు వుంటే 
    ఆ మజాను అనుభవిస్తుంటే 
   అది వర్ణించ నలవికాదు కద !
  
. విదేశీయులు తీసుకు వచ్చి 
  మనకు అలవాటు చేసినదిది వాళ్ళుమనలనువీడి పోయినా
మనము విడువలేక... 
      మరింత పెనవేసుకు పోయినవి ఇంగిలీసొకటి,టీ రెండవది !  
  మనదేశములో విరివిగ టీ తోటలు కల ప్రాంతములలో అస్సాముదే, ప్రథమస్థానం !!
  టీ ని మితముగా వాడినచో 
గుండె జబ్బులను తొలగించే దివ్యౌషదమిది నిజమండి !
మనఇంటికి ఎవరు వచ్చినా టీ నే ఇచ్చు చుందుము మనము!
      టీ కి మన జీవన విధానములో విడదీయలేని బంధ మైనది... !
      *******

కామెంట్‌లు