బ్రహ్మ తన నాలుకపై, విష్ణువు తన హృదయంలో, శివుడు తన అర్ధభాగంలో తమ భార్యలకు స్థానం ఇచ్చారు. తల్లికి ఉన్న శ్రేష్టత మరొకరికి ఇవ్వలేదు ఎవరూ కూడా. ఇక అక్కాచెల్లెళ్ళు, అమ్మమ్మా, నానమ్మల విషయంలో ఎంత పెద్దపీట వేశారో మనవాళ్ళు అందరికీ తెలుసు. తన ప్రాణాలను ఫణంగాపెట్టి మానవ జాతిని సృష్టిస్తున్నది నవలామూర్తి మాత్రమే. మన ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతిని ఆచరించి కాపాడేది స్త్రీ మూర్తియే. పండుగలు, పబ్బాలు, వ్రతాలు, నోములు, మొక్కులు, పూజలు, భగవత్సేవలే కాదు, తన సంసారానికేగాక సర్వజగత్తుకూ ఎనలేని సేవలుచేసే అపార కరుణా సౌజన్యమూర్తి. తరతరాల భారతీయ సర్వకళల సమాహార వధూటికా, భావితరాల నిరంతర చిరంతన దీపకళికాస్రోతస్విని, మన భారతీయ సంస్కృతికి అచ్చమైన ప్రతిబింబం మహిళయే సుమా!!!
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
భారతీయ సంస్కృతికి స్త్రీలే ప్రతిబింబాలు. (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి