పుస్తకాలను చూసినా,
చెట్టుకు వేలాడే మామిడికాయలను చూసినా నా మనసు చలిస్తుంది.
అప్పటి వరకూ నిలకడగా ఉన్న మనసు
ఈ రెండింటి విషయంలో తన స్థిరత్వాన్ని కోల్పోతుంది.
అందుకే వీటికి దరిదాపుల్లో
ఉండకూడదనుకుంటూనే
వాటికేసే ఫరుగులు తీస్తుంటుంది
మనసు.
ఇందాక బజారుకెళ్ళి ఇంటికి తిరిగీ
చేరుకోవడానికి రెండు మూడు దారులున్నాయి. ఆ దారుల్లో ఓ దారి మామిడి చెట్లతో కూడిన వీధొకటుంది. అటు రాకూడదనుకుంటూనే ఆ వీధిలోకి అడుగులేసి మనసుని అటూ ఇటూ పరుగులు పెట్టించాను. అనుకున్నట్టే ఆ చెట్టుకున్న మామిడికాయలు ఒక్కొక్కటీ ఒక్కోలా పలకరించి కవ్వించాయి. వాటి పని పడదామంటే తినేందుకు దంతాలేవి. నోరంతా డొల్లే. ఆడ్డదిడ్డంగా ఊడిన పళ్ళతో ఓ వరుసవావీ లేకుండాపోయిందీ నోటికి. కనుక చూడటంతోనే నాలుకను కట్టడి చేసేందుకు తంటాలు పడ్డాను. ఎలాగైతేనే నియంత్రించాను నాలుకని. కానీ మనసూరుకోక రెచ్చగొడుతోంది కళ్ళను చూడమని, నాలుకను రుచి చూడమని.
దాంతో ఆ వీధిలోంచి ఇవతలకు రావడానికి ఎంతసేపు పట్టిందో చెప్పలేను.
రావడమైతే వచ్చాను ఆ వీధిలోంచి ఇవతలకు. కానీ మనసంతా మామిడికాయలను తినకుండానే పులుపెక్కిపోయింది. విచిత్రమే...అనుకుంటేనే ఇంతలా అయిపోయే నా మనసు పుస్తకాలను చూసినా చేతపట్టుకున్నా చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోదు. కళ్ళనిండా అక్షరాల సమూహమే. మనసు నిండా భావాల పరంపరే. ప్రేమకు సంబంధించిన ఉత్తరాలు కానీ కవితలు కానీ చదవటముటే తెగ సంబరం. చలంగారి ప్రేమలేఖలు పుస్తకం ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. అలాగే నా రాతకూడా ప్రేమలేఖలతోనే మొదలైంది. మద్రాసులో ఉన్న రోజుల్లో ఓ మిత్రుడు ప్రేమిస్తున్న అమ్మాయికి ప్రేమలేఖలు రాసివ్వడంతోనే ప్రేమమీద మోజు పెరిగింది. కానీ ఇందువల్ల జరిగిన మేలేమిటంటే తమిళ పుస్తకాలు చదవటం అలవాటైంది. ఆ అలవాటువల్లే తర్వాతి రోజుల్లో నా రాతకోతలకు ఎంతగానో ఉపయోగపడింది.ఓ మాసపత్రికకు దాదాపు పదేళ్ళు తమిళ కథలు అనువదించగలిగాను తెలుగులో.
అలాగే ఓ పిల్లల మాసపత్రికకు దాదాపు పందొమ్మిదిన్నరేళ్ళు ఆవీ ఇవీ రాయగలిగాను. అయితే ఒక్కటి...ఇంతకాలం రాయగలుగుతున్నా ఇప్పటికీ రాస్తున్న ప్రతి మాటప్పుడు ఏదో ఒక భయం. సరిగ్గా రాస్తున్నానా లేదాని. అందుకు కారణం అమ్మభాషతోపాటు తమిళమూ సరిగ్గా రాకపోవడమే. అయినా రాస్తున్నానంటే అందుకు మా నాన్నగారి ఆశీస్సులే బలమేమో.
ఎంతైనా నేను పండిత పుత్రః పరమ....
ఇంతకన్నా ఇంకేం చెప్పనూ?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి