ఇదీ సంగతి;- - యామిజాల జగదీశ్
 ఆదివారం వచ్చిందంటే వారఫలాలు చదవటం అలవాటు. అందులో ఉన్నట్టు జరుగుతాయో జరగవో అప్రస్తుతం. అయినా పత్రికలు కొన్నందుకు చదువుతాను ఆ పేజీలెందుకు వదిలెయ్యాలని.
అయితే ఈ వారం ఒక పేపర్లో నేను అదృష్టవంతుడినవుతానని రాశారు.
మరొక పత్రికలో అప్పులపాలై ఒత్తిళ్ళకు లోనై అందరితో గొడవలన్నారు. 
ఇంకొక పత్రికలో ప్రేమికులకు కలిసొచ్చిన కాలమన్నారు.
మరో పత్రికలో ఏ పనీ జరగదు...అంతా నిరాశే అని ఉంది.
ఇలా రకరకాల ఫలితాలు చదువుతుంటే పిచ్చోడిలా నవ్వుకున్నాను. మరీ ఇంత తేడాగా చెప్తారా వారఫలాలు?
ఏం గోలండి. ఫలితాలు చెప్పేవారి దారి చూస్తే ఎవరి గోల వారిదే ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉంది. 
అందుకేనేమో వీటిని నమ్మొద్దని చెప్పే వారి మాటనే ప్రామాణికంగా తీసుకోవాలేమో అనే అభిప్రాయం కలుగుతోంది.
మరొకటి...ఎటు తిరిగీ నెలంతా రాసినా నాకొచ్చేవి నాలుగైదువేలు దాటదు. 1338 రూపాయల పెన్షన్ కూడా కలుపుకుని నా నెలవారీ సంపాదన అయిదు వేలు మించదు. 
అటువంటప్పుడు నేను అప్పులపాలవుతానా లేక అదృష్టవంతుడినవుతానా తెలీలేదు. 
నేను ఓ అల్పజీవిని. సామాన్యజీవిని. ఇంకా చెప్పాలంటే అని ఏదో చెప్పాలనుకుంటే ఆ మాటేదో గుర్తుకు రావడం లేదు.  ఎంతగా బుద్ధుడు వలదన్నా ఆశ నన్నొదలదడం లేదు. 

కామెంట్‌లు