మానవుడా ; శ్రీరేఖ , కెనడా
మానవుడా మానుకో 
స్వార్థ చింతన మానుకో
కనులు తెరిచి చూడు
సాటి మానవుల పరిస్థితులు 

మనిషి మనుగడ 
తోటివారితో మెలగినప్పుడే 
నీకున్నంతలో పరుల నాదుకో 
పేదల కష్టాలను అంతమొందించు 

వసతి ఇల్లు బట్ట లేని జీవితాలెన్నో
జీవనాధారం లేని బ్రతుకులెన్నో
దూబారా ఖర్చులను అంతమొందించి
మంచి పనులకు వినియోగించు 

వారి కనుల నీరున్నంత వరకూ  
నీవు సంతసమొంద లేవు
అభ్యాగతుల నాదరించిన నాడే 
నీ జీవనం సఫలమౌతుందని తెలుసుకో


కామెంట్‌లు