నిరూపిద్దాం ;- కోరాడ నరసింహా రావు !
 కార్మిక, కర్షక, శ్రామిక, ప్రతిభా 
  ప్రజ్ఞ విశారధులు, ఐదు శక్తుల సమైక్యశక్తిగఅవతరించెను  ...మేడే మానవుడు..... !
న్యాయమైన  తమ హక్కుల కోసం...ప్రాణాలను బలిపెట్టి... చికాగో నగరాన పారినతమ నెత్తుటిలో తడిసిన గుడ్డనె ఎర్ర జెండాగామలచుకుని...విజ యుడైనదీ రోజే... !ప్రపంచ శ్రామికులు ఏకమైనదీ రోజే !!
    
జగతిన సుఖములునింపగా,ఆ 
ఆనందములనుపంచగాచికాగో స్పూర్తితో విశ్వమానవునిగా... ఈ మేడే రోజునే ... !!
మీ  మీ వ్యక్తిగత స్వార్ధ 
 ప్రయోజ నాలకు మన సంఘ, సమిష్టి భద్రతను,  విజయాన్ని బలిచేయొద్దు  సోదరులారా... !
మన ప్రజల ఆస్తులను పంచుకో జూసిన ప్రభువుల ఆటలుసాగ నీయక,సమైక్యతతోపోరాడు దాం !.. మన సమిష్టి శక్తికి... తిరుగే లేదని నిరూపిద్దాం... !
       *****

కామెంట్‌లు