తీర్థయాత్రలు.;- తాటి కోల పద్మావతి

 తీర్థం అనే పదానికి బావి దగ్గరికి నీళ్లు తొట్టి, శాస్త్రం, ఋషుల చేత సేవించబడిన జలాశయం, గురువు-అనే అర్ధాలు ఉన్నాయి."దీనివల్ల తరిస్తారు"-అంటే తరింప చేసేది అని తీర్థ శబ్దానికి వ్యుత్పత్తి.
భారతీయులు నీటిని కేవలం నీళ్లు గానే చూడటం లేదు."ఆపోవై ప్రాణాః"నీళ్లే ప్రాణాలని భావించారు. హిమాలయాన్ని మంచుకొండ గా కాక-'దేవతాత్మ'గా భావించాడు-కాళిదాస మహాకవి. గంగ ఒక జల ప్రవాహమే కాదు-అది జ్ఞాన ప్రవాహంగా గోచరించింది-శంకరాచార్యుల వారికి.
తీర్థం అనే పదం వేదాల్లోనే ఉంది. అక్కడ మార్గం, నదిలోని రేవు, పవిత్ర ప్రదేశం-అనే అర్ధాల్లో ఉంది. అంగిరసుడు మొదలైన మహర్షులు తమ తపస్సులను తీర్థాలలో ధారపోసారని వేదమంత్రాలు పేర్కొన్నాయి. తీర్థాలలో రుద్రులు సంచరిస్తున్నారని     తైత్త రీయ సంహిత పేర్కొనింది. కనుక కొన్ని కొన్ని ప్రాంతాలు పుణ్య ప్రభావం వల్ల తీర్ధాలుగా ప్రసిద్ధికి ఎక్కుతాయి. మహర్షులు తమ తప శక్తి వల్ల'ఫలానివి'తీర్థాలని నిర్దేశించడం వల్ల అవి పుణ్యతీర్ధాలుగా కీర్తింపబడుతున్నాయి. మహాత్ముల పుణ్యం వల్ల, వాళ్ల సాంగత్యం వల్ల కొన్ని ప్రాంతాలు తీర్థాలయ్యాయి. వారితో కలవడమే తీర్థయాత్ర.

కామెంట్‌లు