శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 జగత్ అంటే కదిలేది చైతన్యం అని అర్ధం. అందుకే ప్రపంచంని జగత్తు అంటారు. ఎన్నో ప్రాణాలతో చలించే జీవరాసులున్నాయి కాబట్టి! వాడుకలో సాహితీ జగత్తు అని అంటాం! బావికి చుట్టు ఉండే గట్టుని హిందీ లో జగత్తు అంటారు. 
జటిలమైన అంటే కఠినం  చిక్కుముడి చిక్కిరిబిక్కిరి అని అర్ధం. కానీ సంస్కృతంలో  జటలున్న వ్యక్తి ని  జటిల అంటారు. పూర్వం బ్రహ్మచారి సన్యాసి జుట్టు జడలు కట్టినెత్తిన ముడిలా నేటి అఘోరీల లాగా ఉండేది. ఆజుట్టుని విడదీయడం చాలా కష్టం!మరాఠీ లో జటిల అంటే శివుడు అని అర్ధం. నేపాలీ లో పొడవాటి చిక్కుల జుట్టు అని  గుజరాతీ లో సన్యాసి అని అర్ధం 🌷

కామెంట్‌లు