గమనించు-గ్రహించు; - -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
కరిగి కరిగి కాంతులీను
క్రొవ్వొత్తిని పరికించుము
దాని నిస్వార్థ త్యాగాన్ని
ఒక్క క్షణం యోచించుము

సృష్టిలోన చిన్న చీమ
సంఘజీవని గుర్తించుము
అది నేర్పే క్రమశిక్షణ
మదిలోపల పాటించుము

నల్లనైన కోకిలమ్మ
గొంతు ప్రతిభ గమనించుము
రంగు కన్న గుణం మిన్నని
ఇకనైనా గ్రహించుము

ఎవ్వరినీ ఏమాత్రం
తక్కువ అంచనా వేయకు
వారిలోని నిపుణతకు
సలాం చేయుట మరవకు


కామెంట్‌లు