కాలచక్ర గమనంలో....
ఆరు ఋతువులూ...
దేనిధర్మాన్ని అది...
నిర్వర్తిస్తూనే ఉంటుంది... !
. ఇది ఋతుచక్రధర్మం...
ఆకురాల్చిన చెట్టు...
.. చిగురించకా మానదు... !
పచ్చదనంతో... నిండుముత్తైదువలాంటి చెట్టు
పూర్తిగా ఆకురాల్చేసి...
. మోడులా మారకా తప్పదు !!
.. ఇది ప్రక్రుతి ధర్మం... !!అస్తమయం...
ఉదయం కోసమేగా !
ఉదయించిన సూర్యునికి...
అస్తమించక తప్పుతుందా ?!
అజన్మించిన వారికి మరణము
మరణించినవారికి జననము తప్పావుకదా....
ఇదే... సృష్టి ధర్మం.... !
ఇది అనివార్యం... !!
ఈసృష్టిలోనిచిత్ర,విచిత్రాలన్నీ
పరికించి పరిశీలిస్తూ...
అనుభూతించి, ఆస్వాదించి,
ఆనందించటమే..... !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి