పూర్వ విద్యార్థులు ; - వసుంధర వెంకట్ నల్ల
 (స్కూల్ ఫైనల్ 1984-85
  సంవత్సరపు పూర్వ
  విద్యార్థుల సమ్మేళనం
  కొరకు)

దూర దూరంగ నున్నట్టి 
 వారాలంత

 చదువుకున్నట్టి రోజుల
 జ్ఞాపకాల నింత

గుర్తు చేయుట కొరకు
మనము కొంత

కాల మెంతో కొంత వెచ్చించి
కలియుడంత

పూర్వ విద్యార్థుల
కలయికంత

మధుర జ్ఞాపకాలతో
మురియుడంత

చిన్న నాటి తీపి గురుతుల
ఘనత నంత

నెమరు వేయుట కొరకు
మనము అంత

 50 సంవత్సరాల వయసు
 గడిచినంత

 ముప్పావల ఆయువు
 మనకు తీరినంత

అటునిటు పావు ఆయువు
ఉన్నాది మన కథ ముగియు నంత

కలియ రారండి మీరంత
చెలిమి చెంత

కలిసి ఒక్క రోజన్న
ఉందాము మనము అంత


కామెంట్‌లు