" కన్నీరు"; - కొప్పరపు తాయారు
 జాలిగా చూస్తున్న కనుల నీరు
  వానలా కారుతోంది ఆకాశం నుండి
  ప్రకృతికి మాత్రం పరవశం
  పాపం మేఘం కరిగి నీరవుతోంది

అదే కదా బాధలెవరికి మనసెవరికి
తమ మనుగడే తమకి ముఖ్యం
తమది కానిది తారసపడితే
వేలు విడిచిన బ్రతికే, సొంతం కాలేము

కాము, ఈ అబద్ధపు బంధాలు
ఆకళింపు కావు కానీ,మనసు
సర్దుకుపోతుంది , ప్రకృతి లాగా
పాపం ప్రకృతి అటు, పోటు,వేటు,

దేనికైనా సిద్ధమే అంటుంది
మనుగడ కూడా అంతే
మారాలంటాం కానీ మారదు
కలవాలంటాం కానీ కలవదు

 అదే బంధాల బంధుత్వాల
లోగిలి అందులో కాని వారు 
పడితే కడవరకు కన్నీరే !!!

కామెంట్‌లు