41)
నేటిబాలికలకు నేర్వలేని కళలు
లేవు మల్లవిద్య లేమజూపు
నంతరిక్షమందు నామె పాదపుముద్ర
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
42)
పాతగ్రంథములను పడుగురు వేలెత్తి
చూపుచుంటిరిపుడు చోద్యముగను
గుడ్డు వచ్చిపిల్ల గొప్ప యడిగినట్లు
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
43)
రాముడైనగాని రాజులైనను గాని
యుగపుధర్మమట్లె యుక్తపరిచె
నేటికాలస్థితి నెట్లు పోలికయుండు
వనజమాట మిగుల వాస్తవమ్ము!
44)
సత్యమార్గమందు సాధక యానము
నమ్మినట్టి స్వామిననుసరించు
పుష్పగుచ్ఛమొకటె పూలు వేరైనను
వనజ మాట మిగులవాస్తవమ్ము !
నేటిబాలికలకు నేర్వలేని కళలు
లేవు మల్లవిద్య లేమజూపు
నంతరిక్షమందు నామె పాదపుముద్ర
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
42)
పాతగ్రంథములను పడుగురు వేలెత్తి
చూపుచుంటిరిపుడు చోద్యముగను
గుడ్డు వచ్చిపిల్ల గొప్ప యడిగినట్లు
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
43)
రాముడైనగాని రాజులైనను గాని
యుగపుధర్మమట్లె యుక్తపరిచె
నేటికాలస్థితి నెట్లు పోలికయుండు
వనజమాట మిగుల వాస్తవమ్ము!
44)
సత్యమార్గమందు సాధక యానము
నమ్మినట్టి స్వామిననుసరించు
పుష్పగుచ్ఛమొకటె పూలు వేరైనను
వనజ మాట మిగులవాస్తవమ్ము !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి