మే డే : శుభాకాంక్షలు కార్మిక లోకం జిందాబాద్...; బల్ల కృష్ణవేణి
   మే 1 అంటే 'మే డే' దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. బానిసత్వం, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా శ్రమ దోపిడీని ఎదురిస్తూ కార్మిక లోకం కీలక హక్కులు సాధించుకున్న దినం మే డే. శ్రమకు తగిన గుర్తింపు సరైన వేతనం రోజుకు 8 గంటలు పని హక్కును కార్మికులు పోరాడి సాధించుకున్న ఈరోజు మే డే ను ఇండియా సహా వందలాది దేశాలు ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకుంటాయి. మే డే ని అన్ని దేశాలు సెలవుదినంగా పాటిస్తారు. 1886 లో అమెరికాలోని చికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది. "ప్రపంచ కార్మికులారా ఏకంకండి... పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప..." అని ఎలుగెత్తి చాటాడు కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ నినాదం పోరు నినాదమై ప్రపంచ కార్మికులను ఆకర్షించింది. అదే స్ఫూర్తితో 1886 లో చికాగో నగరంలో కార్మికుల శక్తికి తగిన గుర్తింపు, పనికి తగిన వేతనం, పని గంటలు తగ్గింపు డిమాండ్ తో పారిశ్రామిక వేత్తలపై తిరగ బడ్డారు.
ఈ పోరాటం లో నాటి యాజమాని వర్గం కొందరు
వందలాదిమంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. ఈ పోరాటం తర్వాతే ప్రపంచ కార్మికులు రోజుకు 8 గంటలు హక్కును సాధించుకున్నారు. నాటి అమరులు త్యాగానికి ప్రతీక 'మే డే'. చాలా దేశాలలో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి వచ్చాయి. ఆ ఉద్యమాలు తో కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారు. 
'అసలు కార్మికులు అంటే ఎవరు'
కనీస సౌకర్యాలు కూడా లేక చెమటోడుస్తూ శారీరక శ్రమను పణంగా పెడుతున్నారు. ప్రభువు ఎక్కిన పల్లకిని మోసేది ఒక కార్మికుడు. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లు మోసేది ఒక కార్మికుడు. మరియు ఏసి గదులలో ఆధునిక కంప్యూటర్లు పై పని చేస్తూ మేధాశక్తిని అమ్ముకుంటూ పెద్ద మొత్తంలో ఒక యజమాని దగ్గర వేతనం తీసుకుంటూ పని చేసే మేనేజర్ తో సహా ఐటి ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగి , గుమస్తా,కార్యాలయ బంట్రోతు,కార్మికుడు,వారంతా కార్మికులే. కేవలం దిగువ తరగతి ఉద్యోగులు మాత్రమే కాదు కార్మికులు.
ఓ కార్మికులారా మీకు మే డే శుభాకాంక్షలు.
1. శ్రమని గుర్తిద్దాం. శ్రామికుడిని గౌరవిద్దాం.
2. పగలనకా... రాత్రనకా... పని చేస్తూ సంస్థల అభివృద్ధే ధేయంగా శ్రమిస్తున్న కార్మిక లోకానికి వందనం.
"నీ శ్రమ రుణం తీర్చుకోలేనిది...
నీ అంకిత భావానికి లాల్ సలాం"
(కార్మికుడు లేనిదే ఎవరి బ్రతుకులు లేవు)
 కార్మికులారా మీకు మే డే శుభాకాంక్షలు..

కామెంట్‌లు