ఈనాటి ఈబందమేనాటిదో
ఈ అనురాగ బంధాలు ఏనాటివో
బంధానికి బంధం రా మన
ఈ స్నేహ బంధం రా
వీడిపోని ఈ అనుబంధం
అనురాగపు
స్నేహబంధం
మమతలొలికే ఈ
అనుబంధం చెరిగి పోని
రాగబంధం
చెలిమితోటి చెంత చేరే
చల్లనైన స్నేహబంధం
కల్లా కపటం లేని స్నేహం
కలకాలం ఉండును నేస్తం
కలిమిలేమి లందు మనది
కలిసి ఉండే స్నేహబంధం
కరుణ తోటి తోడు నిలిచే
కరుణ సాగరానుబంధం
సిరా-వాసు లాంటి
బంధం
కావాలి రా చిన్న బంధం
ప్రేమలొలికే పెన్నిధిరా
పెనవేసినమన అనుబంధం
అనురాగపు
ఆప్యాయతకు
ఆలవాలమైనది స్నేహం
అభిమానపు ఆరాధనకు
ఆదర్శమైనది స్నేహం
కలకాలం కలిసి మెలిసి
ఉందామురా స్నేహం తోటి
తోటి మిత్రులందరికీ తోడు
నిలిచి ఉందాముర నేస్తం
మానవత్వపు విలువలన్నీ
మాసిపోనీయకుండా
మానవ హృదయంబు తోటి సేవ చేయాలిరా నేస్తం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి