సుప్రభాత కవిత ; -బృంద
పొగమంచు దుప్పటి
తీయగా మనసురాని 
నిదుర మబ్బున జగతి
మెలకువలో తీయు కునుకు

నిదురెంత  మధురమైనా
తెల్లవారక తప్పదుగా
వెలుతురంత నిండిపోతే
మేలుకోక తప్పదుగా

అరుదెంచు ప్రభువుకు
అగరుపొగల ఆహ్వానం
అంబరపు సంబరం
అందమైన అతిశయం

మాయలాటి పొగమంచు
మర్మమంతా దాచివుంచు
కళ్ళు తెరచి కనుగొనేలోగా
కాలమంతా కరిగిపోవు

భారమైన వేదనంతా
దూరమయే సూచనలేవో
దారిలోనే వెలుగు చూపి
కరుణించే వేలుపుకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు