శబ్ద సంస్కృతి.. అచ్యుతుని రాజ్యశ్రీ
 సంస్కృతం లో తాలికా అంటే కరతాళ ధ్వనులు చప్పట్లు చరచటం.ఒకచేత్తో చప్పట్లు కొట్టలేము.అలాగే ప్రయత్నం లేకుండా ఫలం లభించదు.హిందీలో తాలికా అంటే సూచీ తాళంచెవి.సూచిక అంటే పుస్తకం లోని విశేషాలు స్పష్టం  చేసేది అని కూడా అంటారు.బెంగాలీలో కూడా ఇదే పదం వాడతారు.
తిలాంజలి అంటే త్యాగం చేయటం విడిచి పెట్టడం అని అర్థం.అంజలిపట్టి దోసిలి నించి నువ్వు లు విడవటం.మనిషి చనిపోయాక చేతిలోనుండి నువ్వు లు నీరు తర్పణం వదలటం.తిలోదకాలు పిండప్రదానం వల్ల ప్రేతాత్మ నించి విముక్తి పొందుతాడు జీవుడు.సంస్కృత ప్రాచీన గ్రంథాలలో తిలాప తిలాంబు తిలోదక అనే పదాలున్నాయి.హిందీలో తిలాంజలి అంటే త్యాగం చేయడం.మరాఠీలో కూడా ఇదే అర్థం.బెంగాలీలో వీడ్కోలు అని అర్థం.
తిలోత్తమ సౌందర్యంని అంతా కలిపి బ్రహ్మ చే సృష్టించబడిన అప్సర.బ్రహ్మ హవనకుండంలోంచి పుట్టింది.సుందోప సుందులు ఈమె ను పొందాలనే కోరికతో కలహించి చనిపోయారు.దుర్వాసుని శాపంతో తిలోత్తమ బాణాసురుడి కూతురు గా పుట్టింది.అష్టావక్రుడు ఈమె కి శాపవిమోచనం కల్గించాడు🌹

కామెంట్‌లు