కొమ్ము!అచ్యుతుని రాజ్యశ్రీ

 బామ్మ మడిచీర కట్టుకుని దేవుని పటాలకి పూలు పెడుతోంది. "బామ్మా " అంటూ వచ్చాడు శివా. "అరే దూరం గా ఉండు.నన్ను తాకకు.మడి కట్టుకున్నా"."మడి అంటే ఏంటి బామ్మా?" కుతూహలంగా అడిగాడు. "శుచిగా స్నానంచేసి దైవస్మరణతో వంట చేస్తే మంచి భావాలు వస్తాయి. అందరినీ తాకుతూ మురికి బట్టలతో వండితే రోగాలు వస్తాయి. "" ఓహో!!మరి ఆపసుపుతో ఏంచేస్తావు బామ్మా?" " ఇదిగో వినాయకుడిని చేస్తాను. ఏశుభకార్యం ఐనా పసుపుతో  చేయాల్సిందే! విఘ్నాలు పోగొడతాడు.త్రిపురాసురులు అనే రాక్షసులను చంపటంకోసం శివుడు తన వాహనం నందిని పంపుతాడు."వారి మూడు నగరాలని నీకొమ్ములతో ఎత్తి పట్టుకో"అని శివుడు వారిని  సంహరించాడు. ఆసమయంలో నంది ఒక కొమ్ము విరిగి కింద పడింది. అదే పసుపు కొమ్ముగా మారింది. వినాయకుడు దాన్ని వెతికితెచ్చాడు.నంది ఆనందించింది. ఆపసుపు కొమ్మునే పిండిగా చేసి గణపతిని చేసి ముందుగా  ఆయన్ని ప్రార్ధించినాకే ఏదైవపూజ వ్రతం చేయాలి. చదువు కునేప్పుడు ముందు గణపతి శ్లోకం చదవాలి తెల్సిందా?" బామ్మ మాటలకు బుద్దిగా తలూపాడు శివా 🌹
కామెంట్‌లు