*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0274)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
నందిచే శుక్రాచార్యుని అపహరణ - శివునిచే మింగబడిన శుక్రాచార్యుడు, శివలింగము నుండి బయటకు వచ్చుట - శుక్ర నామము - మృత్యుంజయ జపము - శివాష్టోత్తర శతనామ వర్ణన - శివుడు అంధకునకు వరములు ఇచ్చుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! రుద్రని జఠరంలో నూరు సంవత్సరాలు ఉన్న శుక్రాచార్యుడు, మహాదేవుని జఠార్గ్నిలో ఉండి కూడా సజీవుడుగా ఉండడానికి శుక్రాచార్యుడు శివ మహా మంత్రాన్ని జపించాడు, ఈ విధంగా......*
*"ఓం నమస్తే దేవేశాయ! సురాసుర నమస్కృత్యాయ! భూతభవ్య మహాదేవాయ! హరితపింగళలోచనాయ! బలాయ బుద్ధరూపిణే! వైయాఘ్రవసనచ్ఛదాయారణేయాయ! త్రైలోక్య ప్రభవే! ఈశ్వరాయ! హరాయ! హరినేత్రాయ! యుగాంతకరణాయానలాయ! గణేశాయ! లోకపాలాయ! మహాభుజాయ! మహాహస్తాయ! శూలినే! మహాదంష్ట్రినే! కాలాయ! మహేశ్వరాయ! అవ్యయాయ! కాలరూపిణే! నీలగ్రీవాయ! మహోదరాయ! గణాద్యక్షాయ! సర్వాత్మనే! సర్వభావనాయ! సర్వగాయ! మృత్యుహంత్రే! పారియాత్ర సువ్రతాయ! బ్రహ్మచారిణే వేదాంత గాయ! తపోంతగాయ పశుపతయే! వ్యంగాయ శూలపాణయే! వృషకేతవే హరయే! జటినే శిఖండినే లకుటినే! మహాయశసే! భూతేశ్వరాయ! గుహావాసినే! వీణాపణవ తాలవతే! అమరాయ దర్శనీయాయ! బాలసూర్యనిభాయ! శ్మశాన వాసినే భగవతే! ఉమాపతయే అరిందమాయ! భగస్యాక్షిపాతినే! పూష్ణో దశన నాశనాయ! క్రూరకర్తకాయ పాశహస్తాయ! ప్రళయకాలాయ! ఉల్కాముఖాయాగ్నికేతవే! మునయే! దీప్తాయ విశాంపతయే! ఉన్నతయే! జనకాయ! చతుర్థకాయ! లోకసత్తమాయ! వామదేవాయ! వాగ్ దాక్షిణ్యాయ! వామతో భిక్షవే భిక్షరూపిణే! జటినే! స్వయంజటిలాయ! శక్రహస్త ప్రతిస్తంభకాయ! వసూనాం స్తంభకాయ! క్రతవే క్రతుకరాయ! కాలాయ మేథావినే! మధుకరాయ చలాయ! వానస్పత్యాయ! వాజసన్నేతి సమాశ్రమ పూజితాయ! జగద్ధాత్రే జగత్కర్త్రే! పురుషాయ శాశ్వతాయ! ధృవాయ ధర్మాధ్యక్షాయ! త్రివర్త్మనే! భూతభావనాయ! త్రినేత్రాయ! బహురూపాయ! సూర్యాయుత సమప్రభాయ! దేవాయ! సర్వతూర్యనినాదినే! సర్వబాధావిమోచనాయ! బంధనాయ! సర్వధారిణే! ధర్మోత్తమాయ! పుష్పదంతాయావిభాగాయ! ముఖాయ! సర్వహరాయ! హిరణ్య శ్రవసే! ద్వారిణే! భీమాయ భీమపరాక్రమాయ! ఓం నమో నమః!"*
*ఈ ప్రార్థన విన్న బోళా శంకరుడు, మనసు కరిగి, అనుగ్రహించగానే, శంభుని జఠర పంజరము నుండి లింగమార్గమున ఉత్కృష్ట వీర్యము లాగా బయట పడ్డాడు. జగదీశ్వరుడైన శివుడు ఆతనిని అజరామరుని చేసాడు. వేదనిధియైన మునివరుడైన శుక్రుడు మరలా భూమి మీద మహేశ్వరుని నుండి పుట్టాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు