*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0275)*

బ్రహ్మ, నారద సంవాదంలో.....
నందిచే శుక్రాచార్యుని అపహరణ - శివునిచే మింగబడిన శుక్రాచార్యుడు, శివలింగము నుండి బయటకు వచ్చుట - శుక్ర నామము - మృత్యుంజయ జపము - శివాష్టోత్తర శతనామ వర్ణన - శివుడు అంధకునకు వరములు ఇచ్చుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! రుద్రని ఉదరంలో ఉండి శుక్రాచార్యుడు, మహాదేవుని మహా మంత్రాన్ని జపించి, పునరుజ్జీవితుడు అయి  శుక్రుడుగా యుద్ధ భూమికి వెళ్ళాడు. అక్కడ, శంకరుని త్రిశూలము చేత కట్టబడిన అంధకుడు కొన ఊపిరితో ఉండి, మహాదేవుని 108 నామాలతో స్తుతిస్తున్నాడు. రుద్రుని ఒక్కొక్క నామం పలుకుతున్నప్పుడు, ఆ ఉమాపతిని తన మనస్సులో నిలుపుకుంటున్నాడు. పరమశివుని నామాలు పలుకడం వలన తన శరీరంలో వస్తున్న ప్రకంపనలకు, పరవశించి పోతున్నాడు, అంధకుడు.*
*మహాదేవం విరూపాక్షం చంద్రార్ధకృత శేఖరమ్ |*
*అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినమ్ ||*
*వృషభాక్షం మహాజ్ఞేయం పురుషం సర్వకామదమం |*
*కామారిం కామదహనం కామరూపం కపర్ధినమ్ ||*
*విరూపం గిరీశం భీమం స్రుక్కిణం రక్తవాససమ్ |*
*యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినమ్ ||*
*గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరమ్ |*
*అణిమాది గుణాధారం త్రిలోకైశ్వర్యదాయకమ్ ||*
*వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలంపటమ్ |*
*మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరమ్ ||*
*త్రైలోక్య ద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనమ్ |*
*కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాససమ్ ||*
*గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణమ్ |*
*దత్తాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితామ్ ||*
*అఘోరం ఘోర దైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిమ్ |*
*భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితమ్ ||*
*భూతేశ్వరం భూతనాధం పంచభూతాశ్రితమ్ ఖగమ్ |*
*క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియమ్ ||*
*చండతుండం గరుత్మంతం నిస్త్రింశం శవభోజనమ్ |*
*లేలిహానం మహారౌద్రం మృత్యుంమృత్యోరగోచనమ్ ||*
*మృత్యోర్ముత్యుం మహాసేనం శ్మశానారణ్యవాసినమ్ |*
*సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకమ్ ||*
*అర్ధనారీశ్వరం భానుం భానుకోటిశతప్రభుమ్ |*
*యజ్ఞం యజ్ఞపతిం రుద్రమీశానం వరదం శివమ్ ||*
*అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః |*
*శివస్య దానవో ధ్యాయన్ ముక్తస్తస్మాత్మహాభయాత్ ||*
                           (శి.పు.రు.సం.యుద్ధకాండ 49/5 - 18)
*"ఎంతో భీకరమైన, గొప్పదైన భయం నుండి నన్ను రక్ష చేయి అంబాపతీ" అని అష్టోత్తర శతనామ పూజ చేసాడు అంధకుడు. "మహేశా! పార్వతీ పతీ! నీ కుమారుడనైన నా బుద్దిలేమి గురించి ఆలోచించండి. నేను నా తల్లి అయిన పార్వతిని ఎల్లపేళలా గౌరవ భావంతో చూసేలా అనుగ్రహించు. నీవు, చల్లని చంద్రకిరణములు, శంఖము, వంటి శరీర రంగు కలవాడివి. నా మీద క్రోధము వదిలి పెట్టి నాకు, నిరంతరము మీ ఇద్దరి మీదా భక్తి ఉండేటట్టు ఆశీర్వదించు. నాకు దేవతలతో ఉన్న వైరము పోవలెను. నేను ప్రశాంతమైన మనసుతో ఉండాలి. మీ కృపతో పుట్టిన వాడిని. నాలో విరుద్ధమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. నీ యందు భక్తి, దైత్య లక్షణాలు. ఈ వైరుధ్యాన్ని తొలగించి, నీ భక్తునిగా చేయి స్వామి." అని వేనోళ్ళ ప్రార్ధించాడు.*
*ఈ ప్రార్థన విన్న రుద్రుడు, అంధకుని మీద కరుణ కురిపించి, అక్కున చేర్చుకుని, ఉమాపార్వతులు నుదుటి మీద ముద్దు పెట్టారు. వెంటనే అంధకునికి, తన పూర్వ జన్మ స్ఫురణ వచ్చింది. తల్లిదండ్రులకు ప్రణామాలు చేసి, తన కోరికలు అన్నీ తీరి పోయి, అమ్మ కరుణతో గణాద్యక్ష పదవి కూడా పొందాడు, అంధకుడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss
కామెంట్‌లు