*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* -*రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0276)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
శుక్రాచార్యుని ఘోర తపస్సు - మనసు శంభునికి ఇచ్చుట - అష్టమూర్త్యష్టకము - మృతసంజీవని వర ప్రసాదము....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! తనకు వరం ఇవ్వడానికి సిద్ధంగా వున్నాను, అన్న శంభుని మాటలు విన్న శుక్రుని శరీరం, మనసు ఆనంద పారవశ్యంలో మునిగి పోయాయి. కన్నుల నుండి ఆనంద భాష్పాలు చెక్కిళ్ళ మీదుగా జాలువారుతున్నాయి. ఆ క్షణం లో ఏమి చేయాలో పాలుపోని శుక్రుడు, ఆ స్వామి పాదాల మీద వాలిపోయాడు. చేతులు కట్టుకుని, స్వామికి జయం, స్వామికి జయం అని పలుకుతూ, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, యజమానము, చంద్రుడు, సూర్యుడు అనే ఈ ఎనిమిదింటికినీ అధిష్టాన దేవతలు అయిన శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహేదేవుడు, ఈశానుడు అనబడే అష్టమూర్తులకు రూపమైన అష్టమూర్తి దారి, సదాశివుని స్తుతి చేసాడు.*
*నీవు సర్వస్వరూపుడవు. జగదీశ్వరుడవు. నీ ప్రకాశముచేత, రాత్రిపూట చీకటి పోగొట్టి, రాత్రులందు తిరిగే రాక్షస మూకను భస్మం చేస్తావు. శరణాగత రక్షకుడవు. అగ్ని, వాయువు, నీరు, అన్నీ కూడా మీ స్వరూపాలే. చిత్ర, విచిత్రమైన సుందర రచనలను ఎన్నైనా చేయగలరు. అన్నిటినీ, నమేషకాలంలో మీలో లయం చేసుకోగలరు. మీరు, సర్వ వ్యాపులు. విశ్చనాథా! నా అజ్ఞానమును పటాపంచలు చేయండి. శంకరా! మీరు అందరి ప్రాణులలో ఆత్మ ఉన్నారు. ఇది నిజం. అటువంటి, మీకు నమస్కారం! మీ ఈ రూపములు అనేకములుగా కొనసాగుతుంటాయి. వాడిని లెక్కించడం, ఎవరి వల్ల కాదు. మీకు నా అభివాదములు అంటూ, అష్టమూర్త్యష్టక స్తోత్రము ద్వారా శివుని కీర్తించాడు.*
*అష్టమూర్త్యష్టక స్తోత్రము చెపుతూ, తన తలను శంభుని పాదాల దగ్గర ఉంచి పదే పదే నమస్కారాలు చేస్తున్నాడు, శుక్రుడు. ఎంతో తెజస్సు కలిగిన భార్గవ కుమారుడు, శుక్రుడు తనను కీర్తించిన శుక్రుని, శంభుడు లేవనెత్తి, అక్కున చేర్చుకున్నారు. నాయనా! నీవు నా గొప్ప భక్తుడవు. కవివి. ఉత్తమమైన తపస్సు, ఆచరణము చేత, లింగము స్థాపించడము చేతా నీ మనసును నాకు ఇవ్వడం చేతా, అవిముక్త కాశీ నగరములో, నీవు నడచుకున్న వుధానము చేత, నీవు నాకు అత్యంత ప్రీతి పాత్రుడవు అయ్యావు. నీవు నీ శరీరం తో నా ఉదర ప్రవేశం చేసి, ఇంద్రయ మార్గమున వెలువడి, పుత్రునిగా జన్మిస్తావు. నీ తపో బలముతో నీవు నిర్మించిన "మృతసంజీవని" విద్యను నీకు ప్రసాదిస్తాను. నీవు నన్ను తలచుకుని ఎవరి మీద ఈ విద్యను వాడినా, వారు మళ్ళీ జన్మిస్తారు. నీవు ఆకాశమందు తారగా ఉండిపోతావు (శుక్ర నక్షత్రం). గ్రహములలో శుక్ర గ్రహం గా ఉంటావు.*
*నీ అనుగ్రహం ఉన్నప్పుడు మానవులు చేసిన అన్ని పనులూ ఫలవంతమౌతాయి. నీవు స్థాపించిన శివలింగము "శుక్రేశుడు" అనే పేరుతో ప్రసిద్ధి పొందుతుంది. ఇటువంటి వరాలు ఇచ్చి శంకరుడు ఆ లింగములోనే సమావిష్టుడు అయ్యాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం