*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0279)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
బాణాసురుని ఘోర తపస్సు - ఉష స్వప్నంలో అనిరుద్ధుని కలవడం - అనిరుద్ధుని అపహరణ - నాగఫాశ బంధనం - దుర్గాస్తవం - శోణితపురము మీదికి శ్రీకృష్ణ దండయాత్ర - శివునితో యుద్ధం - జృంభణాస్త్ర ప్రయోగము - బాణుని సైన్య నాశనము.....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*అంతటి, శంభుని మెప్పించి, తన బలమైన భుజములు కాలిన కట్టెల వలె నేల రాలి పడతాయి అని వరమిపొందిన బాణుడు, తన మందిరానికి వెళతాడు. కొంత కాలనికి, బాణుని ఆయుధగారం మీద ఉంచబడిన బాణుని ధ్వజము తెగి క్రింద పడిపోయింది, అని తెలుసుకుని బాణుడు, తన భుజముల తీట తీరే సమయం ఆసన్నమైంది అని సంతోష పడ్డాడు. తనతో సరి సమానంగా యుద్ధ విద్యలు నేర్చిన వారు ఎవరు యుద్ధం చేయడానికి వస్తారు అని అలోచిస్తున్నాడు. ఇలా కాలం గడుస్తుండగా, బాణాసురిని కుమార్తె, ఉష, శ్రీ కృష్ణమూర్తిని పూజిస్తోంది. మంగళకరములైన అన్ని ఆభరణములు, పూలు, పట్టు వస్త్రాలు ధరించి తన అంతఃపురములో నిద్రలో ఉండగా, శ్రీకృష్ణుని మనుమడు అయిన అనిరుద్ధునితో ప్రేమలో పడి, తన మనసు పోగొట్టుకుంటుంది.*
*తెల్లవారాక, తన చెలికత్తె, దివ్యయోగిని అయిన చిత్రలేఖతో ముందటి రాత్రి, అనిరుద్ధుడు తన మనసు దొంగిలించిన విషయం చెప్పి, ఆతడు ఎక్కడ వున్న తన దగ్గరకు తీసుకు రమ్మంటుంది. అప్పుడు, చిత్రలేఖ, అనిరుద్ధుడు ఎవరో, ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో తెలియకుండా తాను ఎలా తీసుకురాగలుగుతాను అన్నది. అది విన్న బాణుని కుమార్తె, ఉష, నీవు ఆతనిని తీసుకు రాకపోతే నాకు మరణమే శరణము అని చెప్పింది. అది విన్న చిత్రలేఖ, చిత్ర లేఖనంలో తన ప్రావీణ్యతను ఉపయోగించి, దేవతలు, మునులు అందరి బొమ్మలు గీసింది. చివరకు మానవుల బొమ్మలు గీయటం మొదలుపెట్టి, రాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, ఆతని కుమారుడు అనిరుద్ధుని బొమ్మ కూడా గీస్తుంది. అనిరుద్ధుని బొమ్మ గీస్తున్నప్పుడు, చూసిన ఉష సిగ్గుపడి, తన మనోహరుడు అతనే అని చెపుతుంది.*
*ఉష కోరిక కాదనలేని చిత్రలేఖ, జ్యేష్ట శుక్ల చతుర్దశి నాడు మూడవ జామున ద్వారకా పట్టణము చేరింది. అందరూ మంచి నిద్రలో ఉండగా, అనిరుద్ధుని మంచము మీద నుండి తీసుకుని ఉష ఉన్న భవనానికి క్షణ కాలం లో తీసుకు వచ్చింది. ఉషా, అనిరుద్ధులు తమ ప్రేమ ప్రవాహంలో తలమునకలై సంతోష పడుతున్నారు. అయితే, అంతఃపురంలో, ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు చేరాడని, ఆతడు ఉషతో దగ్గరగా మసలుతున్నాడు అని తెలిసికొనిన సైనికులు, తమ రాజు బాణుని వద్దకు వెళ్ళి తమకు తెలిసిన విషయం వివరించారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం